Malamahanadu
-
ఈబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, హైదరాబాద్: ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. జనాభాలో 70 శాతానికి పైగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా, ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడంతో తీవ్ర అన్యాయం జరిగినట్లేనని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల నేపథ్యం లో ఓట్లు రాబట్టేందుకు బీజేపీ ప్రభుత్వం చేసిన ఎత్తుగడ అని అన్నారు. అగ్రకుల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తూ.. పార్లమెంటులో బిల్లు పెట్టడాన్ని మాలమహానాడు తీవ్రంగా ఖండించింది. -
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సహకరించకండి
కుంతియాకు మాలమహానాడు వినతి సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కుంతియాను మాలమహానాడు నేతలు కోరారు. అంతేకాకుండా వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కుంతియాను ఢిల్లీలో మాలమహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు కలసి వినతిపత్రాన్ని అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు, రాజ్యాంగ స్ఫూర్తికి వర్గీకరణ విరుద్ధమని పేర్కొన్నారు. ఈ విషయమై పార్టీ వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కుంతియా హామీ ఇచ్చినట్టు చెన్నయ్య తెలిపారు. మాలమహానాడు ఆధ్వర్యంలో ధర్నా వర్గీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శనివారం ధర్నా చేపట్టారు. సంఘం అధ్యక్షుడు రాంమూర్తి మాట్లా డుతూ.. రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేస్తే సహిం చబోమన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దళితులపై జరుగుతున్న దాడులపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
19న రాజమండ్రిలో దళిత, గిరిజన మహాగర్జన
విజయవాడ(గాంధీనగర్): ఎస్సీ,ఎస్టీల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 19న రాజమండ్రిలో దళిత, గిరిజన మహాగర్జన సభ నిర్వహిస్తున్నట్లు మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు ప్రత్తిపాటి ప్రసాదరావు తెలిపారు. స్థానిక ఐలాపురం హోటల్లో మాల మహానాడు కార్యకర్తల సమావేశం శుక్రవారం జరిగింది. ఆయన సభ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీకి అనుకూలంగా హైకోర్టు తీర్పు వస్తుందని భావించినట్లు చెప్పారు. అనంతరం మాలమహానాడు అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రత్తిపాటి ప్రసాదరావును కార్యకర్తలు సత్కరించారు. సమావేశంలో మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి జోనీ కుమారి, యానాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల రామచంద్రయ్య, వై కొండలరావు , కెఈ శాస్త్రి, ఎల్వీ ప్రసాదరావు, తమ్మిశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
వర్గీకరణ అడ్డుకునేందుకు సిద్ధం కావాలి
మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్‌కుమార్ పిఠాపురం టౌన్ : ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో, వీటిని అడ్డుకునేందుకు సిద్ధం కావాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్ కుమార్ పిలుపు ఇచ్చారు. స్థానిక చెలికాని భావనరావు సభాసదన్‌లో బు««దlవారం నిర్వహించిన మాలమహానాడు పునర్ నిర్మాణసభలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ కన్వీనర్ కొంగు నూకరాజు అధ్యక్షత జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ 2004లో పీవీ రావు నాయకత్వంలో అప్పటి అధికార పార్టీలకు బుద్ధి చెప్పిన మాదిరిగా ఇప్పుడూ చెప్పాలని కోరారు. బలమైన కమిటీలను ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధం కావాలని, దళితులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఎదిరించడానికి సన్నద్ధం కావాలని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అధికార పార్టీ కార్యకర్తలకు కాకుండా నిజమైన పేద దళితులకు అందాలని డిమాండ్ చేశారు. మాలమహానాడు పేరుతో కొంతమంది చేస్తున్న దందాలు, సెటిల్మెంట్లు.. పీపీ రావు స్థాపించిన మాలమహానాడుకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్ర అధ్యక్షుడు జి.సూర్యప్రకాష్ మాట్లాడుతూ సంక్షేమ పథకాల కోసం ఎస్సీ వర్గీకరణకు తీసుకువచ్చిన జీఓను తక్షణం రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాగ్‌లాగ్ పోస్టులను భర్తీచేయాలని, చంద్రబాబు అధికారం చేపట్టి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా ఒక్క ఉద్యోగం కూడ భర్తీ చేయలేదని విమర్శించారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు మారెల్ల సోమరాజు, నాయకులు పి.పరశురాముడు, మహిళా విభాగం కన్వీనర్ ఎం.సుశీల, బత్తిన శామ్యూల్, కె.చంద్రశేఖర్, మాతా అబ్బులు, ఎడ్ల లక్ష్మీపతి, ఎద్దు నానిబాబు, ఇజ్జిన చలపతిరావు, దారా ప్రభాకరరావు, బొండాడ వీరరాఘవులు, బందిలి నాగేశ్వరరావు మాట్లాడారు. నియోజకవర్గ కమిటీతో పాటు పిఠాపురం, కొత్తపల్లి, గొల్లప్రోలు, మండలాల కమిటీలను ఎంపిక చేశారు. -
మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేందర్రావు
న్యూశాయంపేట : మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నక్క రాజేందర్రావును నియమించినట్లు జాతీయ చీఫ్ అడ్వయిజర్ వి.ఎల్.రాజు, జాతీయ అధ్యక్షుడు వల్లం సురేష్ తెలిపారు. ఈమేరకు నియామకపత్రాన్ని ఆదివారం రాజేందర్రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల హక్కుల సాధన కోసం పోరాడతానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలు వేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు రాజేందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. -
దళితులను విభజించి పాలిస్తున్న పార్టీలు
కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తూ దళితుల మధ్య చిచ్చురేపుతున్న ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ తీరు మార్చుకోవాలని మాల కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే మాలల నిరాహార దీక్షలకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట మాల కుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని, ఉషామెహ్రా కమిషన్ వేసి నిజనిర్ధారణ చేపట్టి వర్గీకరణను కొట్టివేసిందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేస్తూ దళితుల మధ్య ఆగాధాన్ని సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలో మాలకుల సంఘాల ఐక్యవేదిక నాయకులు కాటిక రాజమౌళి, మేడి అంజయ్య, వేముల రమేశ్, తీట్ల ఈశ్వరి, దండి రవీందర్, నక్క రాజయ్య, గంటల రేణుక, మంచాల వెంకటస్వామి, బండ అనిత, శీలం పుష్పలత, మేకల రజనీ, బొగ్గుల మల్లేశం తదితరులు కూర్చున్నారు. శిబిరాన్ని దళిత సంఘాల నాయకులు మేడి రాజవీరు, జానపట్ల స్వామి, కొరివి వేణుగోపాల్,నల్లాల కనుకరాజు, మేడి మహేశ్, కర్నె పవన్‌కుమార్, దామెర సత్యం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నిమ్మరసం అందించి దీక్షల విరమింపజేశారు. -
ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్ద ఉద్రిక్తత
హైదరాబాద్ : నగరంలోని ఎన్టీఆర్ ట్రస్ట్ ముందు శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎలా మద్ధతు ఇస్తాడంటూ మాలమహానాడు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు, మాలమహానాడు నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు మాలమహానాడు నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి బంజారాహిల్స్ స్టేషన్‌కు తరలించారు. -
మీ పోరాటాలకు మా మద్దతు
వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాలమహానాడు సంఘీభావం సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న పోరాటాలకు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు ప్రకటించింది. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆధ్వర్యంలో పలువురు నేతలు గురువారం వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో కలిశారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ దళిత, బలహీనవర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని జగన్‌కు వారు తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాల వల్ల ఎస్సీలు ఎంతో లబ్ధి పొందారని చెప్పారు. కలసిమెలసి ఉన్న ఎస్సీల మధ్య చిచ్చు పెట్టింది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడేనని, ఆయన వల్ల ఏపీలో దళితులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగాలంటే జగన్ నాయకత్వం అవసరమని, అందుకే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామని చెన్నయ్య తెలిపారు. జగన్‌ను కలిసిన నేతల్లో మాలమహానాడు ఉభయ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి జంగా శ్రీనివాస్, తెలంగాణ మాలమహానాడు వర్కింగ్ అధ్యక్షుడు విజయ్‌బాబు, విద్యార్థి విభాగం వర్కింగ్ అధ్యక్షుడు కుమార్రాజు, విద్యార్థి నేత సుధాకర్‌బాబు ఉన్నారు. -
హోదా కోసం టవరెక్కాడు
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ.. ఓ వ్యక్తి టవరెక్కాడు. ఒంగోలు జిల్లా కేంద్రంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బిల్లా వసంతరావు స్థానిక సెల్ టవర్ ఎక్కాడు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు... ప్రత్యేక హోదాపై ప్రభుత్వం ప్రకటన చేయకపోతే.. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటా అంని తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని కిందకి దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. -
పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబుకు బుద్ధి రాలేదు
దొడ్డిదారిన వర్గీకరణకు ప్రయత్నాలు జీవో 25ను రద్దు చేయాలి పీవీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు అశోక్ కుమార్ గాంధీనగర్ : దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణ చేపట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పీవీరావు మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్ దుయ్యబట్టారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేసేందుకే జీవో 25 జారీ చేశారన్నారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ‘మాలల పంతం-చంద్రబాబు అంతం’ నినాదంతో వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తు చేశారు. పదేళ్లు అధికారానికి దూరమైనా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. జీవో 25ను రద్దు చేయకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామన్నారు. వర్గీకరణ ఏ రూపంలో చేపట్టినా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఏకపక్షంగా వర్గీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చంద్రబాబుకు మళ్లీ బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ప్రభుత్వ రంగంలో నియామకాలు నిలిచిపోయినందున ప్రైవేటు రంగంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో రిజర్వేషన్ల ఉద్యమంలో భాగంగా హార్ధిక్ పటేల్ చేసిన వ్యాఖ్యలను పీవీరావు మాలమహానాడు ఖండించింది. తమకు రిజర్వేషన్లు ఇవ్వకపోతే అసలు రిజర్వేషన్ వ్యవస్థనే రద్దు చేయాలని కోరడం సమంజసం కాదన్నారు. గుజరాత్ ఉద్యమం పూర్తిగా ఆర్ఎస్ఎస్ అండదండలతో నడుస్తోందన్నారు. పీవీరావు ఆశయ సాధనకోసమే ‘పీవీరావు మాలమహానాడు’ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అడ్హాక్ కమిటీ సభ్యులు పళ్లం ప్రసాద్, పి.పరశురాముడు, కె.లక్ష్మీనారాయణ, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ యర్ర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ భవన్ ముట్టడించిన మాలమహానాడు
-
తెలంగాణ భవన్ ముట్టడించిన మాలమహానాడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌ను మాలమహానాడు కార్యకర్తలు ముట్టడించారు. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈశ్వర్‌కు మంత్రి పదవి ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ నిరసనకు దిగారు. పోలీసులు పలువురు మాలమహానాడు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ ఎమ్మెల్యే అయిన కొప్పుల ఈశ్వర్‌కు చీఫ్ విప్ పదవి ఇవ్వడంతో మాలమహానాడు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈశ్వర్ కు మంత్రి పదవే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల కేసీఆర్ దిష్టి బొమ్మలను తగులబెట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఈశ్వర్‌ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. -
వంచన ‘వరున్ని’ శిక్షించండి
కోనేరుసెంటర్ (మచిలీపట్నం), న్యూస్‌లైన్ : వివాహం పేరుతో యువతిని మోసగించిన కుటుంబంపై పోలీసులు తగిన చర్యలు తీసుకుని బాధితురాలికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు కోటే రామచంద్రరావు (చిన్నా) డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మాలమహానాడు ఆధ్వర్యంలో బాధితురాలు తరపున పోరాటాలకు సిద్దపడతామని ఆయన హెచ్చరించారు. వివాహం అనంతరం భర్త చేతిలో మోసపోయిన బాధితురాలితో కలిసి సోమవారం జిల్లా మాలమహానాడు నాయకులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉన్నతాధికారులకు జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. స్థానిక ఆర్ ఆర్ భవన్లో బాధితురాలితో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరావు బాధితురాలికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. గుంటూరు జిల్లా తెనాలి గ్రామం గంగానమ్మపేటకు చెందిన గడ్డం థామస్ కుమారుడు సాధూథామస్కు పమిడిముక్కల మండలం మామిడికోళ్ళపల్లి గ్రామ శివారు గండ్రవానిగూడెంకు చెందిన జుజ్జువరపు అశోక్ కుమార్తె సునీతతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. కొన్నాళ్లు బాగానే కాపురం చేసిన ఈయన ‘మా కుటుంబానికి నువ్వు సరిపోవు మమ్మల్ని వదిలి వెళ్ళిపో ‘అంటూ బెదిరించటంతోపాటు కొట్టడం, పలు పత్రాలపై సంతకాలు పెట్టించుకోవడంతో భయపడి అక్కడి నుంచి తప్పించుకొని పమిడిముక్కల పోలీసులకు ఫిర్యాదు చేసి అక్కడి నుంచి ఘంటసాలలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. అయినా వదలకుండా హత్యాయత్నాలకు ప్రయత్నించగాఘంటసాల పోలీస్స్టేషన్లోనూ బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన కేసు నమోదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. సంఘటనపై విచారణ జరిపించి తనకు తగిన న్యాయం చేసి భర్త అతని కుటుంబసభ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సునీత కోరారు అభ్యర్థించారు. ఈ సమావేశంలో మాలమహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు జక్కుల మోషే, కార్యదర్శి బండి సుబ్బారావు, అరుంధతి బంధు సంక్షేమ సేవా మండలి రాష్ట్ర కార్యదర్శి దిరిశం బాలకోటయ్య, ఘంటసాల మండలం సోషల్ యాక్షన్ కమిటీ నాయకులు పీ పీ ఎం బేగం, కళ్ళేపల్లి కమల, జి సీతామహాలక్ష్మి, ఎ రాధా, బాధితురాలి కుటుంబసభ్యులు పాల్గొన్నారు.