
తెలంగాణ భవన్ ముట్టడించిన మాలమహానాడు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ను మాలమహానాడు కార్యకర్తలు ముట్టడించారు. కొప్పుల ఈశ్వర్కు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈశ్వర్కు మంత్రి పదవి ఇచ్చేంత వరకు ధర్నా విరమించేది లేదంటూ నిరసనకు దిగారు. పోలీసులు పలువురు మాలమహానాడు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ ఎమ్మెల్యే అయిన కొప్పుల ఈశ్వర్కు చీఫ్ విప్ పదవి ఇవ్వడంతో మాలమహానాడు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈశ్వర్ కు మంత్రి పదవే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పలు చోట్ల కేసీఆర్ దిష్టి బొమ్మలను తగులబెట్టారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి ఈశ్వర్ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు.