దళితులను విభజించి పాలిస్తున్న పార్టీలు
Published Tue, Aug 9 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
కరీంనగర్ : ఎస్సీ వర్గీకరణ పేరుతో విభజించి పాలిస్తూ దళితుల మధ్య చిచ్చురేపుతున్న ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ తీరు మార్చుకోవాలని మాల కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు కోరారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే మాలల నిరాహార దీక్షలకు మద్దతుగా కలెక్టరేట్ ఎదుట మాల కుల సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని గతంలోనే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని, ఉషామెహ్రా కమిషన్ వేసి నిజనిర్ధారణ చేపట్టి వర్గీకరణను కొట్టివేసిందని గుర్తుచేశారు. రాజకీయ పార్టీలు ఓట్లు, సీట్ల కోసం రాజకీయాలు చేస్తూ దళితుల మధ్య ఆగాధాన్ని సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు. రిలే నిరాహార దీక్షలో మాలకుల సంఘాల ఐక్యవేదిక నాయకులు కాటిక రాజమౌళి, మేడి అంజయ్య, వేముల రమేశ్, తీట్ల ఈశ్వరి, దండి రవీందర్, నక్క రాజయ్య, గంటల రేణుక, మంచాల వెంకటస్వామి, బండ అనిత, శీలం పుష్పలత, మేకల రజనీ, బొగ్గుల మల్లేశం తదితరులు కూర్చున్నారు. శిబిరాన్ని దళిత సంఘాల నాయకులు మేడి రాజవీరు, జానపట్ల స్వామి, కొరివి వేణుగోపాల్,నల్లాల కనుకరాజు, మేడి మహేశ్, కర్నె పవన్‌కుమార్, దామెర సత్యం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. నిమ్మరసం అందించి దీక్షల విరమింపజేశారు.
Advertisement
Advertisement