మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా రాజేందర్‌రావు
Published Mon, Oct 3 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
న్యూశాయంపేట : మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా నక్క రాజేందర్‌రావును నియమించినట్లు జాతీయ చీఫ్ అడ్వయిజర్ వి.ఎల్.రాజు, జాతీయ అధ్యక్షుడు వల్లం సురేష్ తెలిపారు.
ఈమేరకు నియామకపత్రాన్ని ఆదివారం రాజేందర్‌రావుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాలల హక్కుల సాధన కోసం పోరాడతానని తెలిపారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి కమిటీలు వేస్తామన్నారు. తన నియామకానికి సహకరించిన నాయకులకు రాజేందర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement