కేంద్రమంత్రి అథావాలేను కోరిన సంఘం నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలేను అఖిల భారత క్రిస్టియన్ల సమాఖ్య కోరింది. ఈ మేరకు సంఘం నేతలు శ్రీమంతులు, రాజేశ్‌బాబు తదితరులు శుక్రవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు.
దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుంటే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు.