Dalit Christian
-
ఇల్లు చక్కబెట్టాం...దేశాన్ని చక్కబెట్టుకుందాం
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): అన్ని వర్గాల ప్రజలు, సంఘాల సహకారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఇల్లు చక్కబెట్టుకున్నామని, ఇప్పుడు దేశాన్ని చక్కబెట్టే పనిలో బీఆర్ఎస్తో కలిసి అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఎస్పీరోడ్లోని వెస్లీ కళాశాల మైదానంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో బుధవారం దళిత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంతో పాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలవారిని సమానంగా చూశారని, ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎక్కడా ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదని తెలిపారు. అంబేడ్కర్ మనవడు డాక్టర్ రాజారత్నం అంబేడ్కర్ మాట్లాడుతూ..దళిత క్రైస్తవులు ఐకమత్యంతో ముందుకు వెళితేనే రాజ్యాధికారం సాధిస్తారన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో టీఎస్ ఎంస్ఐడీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు, సీఎస్ఐ సినార్డ్ మోడరేటర్ ధర్మరాజు, మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, వివిధ రాష్ట్రాల బిషప్‌లు పాల్గొన్నారు. -
దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా బిల్లు పెట్టండి
కేంద్రమంత్రి అథావాలేను కోరిన సంఘం నేతలు సాక్షి, న్యూఢిల్లీ: దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్ర మంత్రి రాందాస్ అథావాలేను అఖిల భారత క్రిస్టియన్ల సమాఖ్య కోరింది. ఈ మేరకు సంఘం నేతలు శ్రీమంతులు, రాజేశ్‌బాబు తదితరులు శుక్రవారం కేంద్ర మంత్రిని ఢిల్లీలో కలసి వినతిపత్రాన్ని సమర్పించారు. దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకుంటే తాము సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని వారు తెలిపారు. -
దళిత క్రైస్తవ గర్జన పోస్టర్ విడుదల
- వైఎస్ జగన్‌ను కలసిన ఏఐసీఎఫ్ నేతలు - ఎస్సీ హోదా కల్పించాలన్న తమ డిమాండ్‌ను వివరించిన నాయకులు సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 14న రాజమండ్రిలో తలపెట్టిన ‘దళిత క్రైస్తవ గర్జన’కు సంబంధించిన పోస్టర్‌ను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన్ను కలసిన ఏఐసీఎఫ్ నేతలు గద్దపాటి విజయరాజు, డేవిడ్ కడారి తమ డిమాండ్ల గురించి వివరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్ సబబైనదంటూ జగన్ వారితో ఏకీభవించారు. ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు విజయరాజు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను వివరించినపుడు జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.