రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): అన్ని వర్గాల ప్రజలు, సంఘాల సహకారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఇల్లు చక్కబెట్టుకున్నామని, ఇప్పుడు దేశాన్ని చక్కబెట్టే పనిలో బీఆర్‌ఎస్‌తో కలిసి అందరూ ముందుకు రావాలని ఎమ్మెల్సీ కవిత పిలుపునిచ్చారు. ఎస్పీరోడ్‌లోని వెస్లీ కళాశాల మైదానంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో బుధవారం దళిత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంతో పాటు సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కవిత పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అన్ని మతాలవారిని సమానంగా చూశారని, ఆయన తొమ్మిదేళ్ల పాలనలో ఎక్కడా ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదని తెలిపారు. అంబేడ్కర్ మనవడు డాక్టర్ రాజారత్నం అంబేడ్కర్ మాట్లాడుతూ..దళిత క్రైస్తవులు ఐకమత్యంతో ముందుకు వెళితేనే రాజ్యాధికారం సాధిస్తారన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్‌ను కట్ చేశారు. కార్యక్రమంలో టీఎస్ ఎంస్‌ఐడీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీమంత్రి రావెల కిశోర్‌బాబు, సీఎస్‌ఐ సినార్డ్ మోడరేటర్ ధర్మరాజు, మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, వివిధ రాష్ట్రాల బిషప్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment