దళిత క్రైస్తవ గర్జన పోస్టర్ విడుదల
- వైఎస్ జగన్‌ను కలసిన ఏఐసీఎఫ్ నేతలు
- ఎస్సీ హోదా కల్పించాలన్న తమ డిమాండ్‌ను వివరించిన నాయకులు
సాక్షి, హైదరాబాద్: దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌తో ఆలిండియా క్రిస్టియన్ ఫెడరేషన్(ఏఐసీఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 14న రాజమండ్రిలో తలపెట్టిన ‘దళిత క్రైస్తవ గర్జన’కు సంబంధించిన పోస్టర్‌ను ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన్ను కలసిన ఏఐసీఎఫ్ నేతలు గద్దపాటి విజయరాజు, డేవిడ్ కడారి తమ డిమాండ్ల గురించి వివరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్ సబబైనదంటూ జగన్ వారితో ఏకీభవించారు. ఏఐసీఎఫ్ జాతీయ అధ్యక్షుడు విజయరాజు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను వివరించినపుడు జగన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.