
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంట్‌లో ఆమోదించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. వర్గీకరణ బిల్లును ఆమోదించాలనే డిమాండ్‌తో మార్చి 13న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతు ఇవ్వాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ శుక్రవారం మఖ్దూంభవన్‌లో చాడను కలిశారు.
చాడ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత కూడా కేంద్రం స్పందించకపోవడమేమిటని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో వర్గీకరణకు మద్దతుగా అన్ని పార్టీలను సమన్వయం చేస్తామని చెప్పారు. బంద్‌కు సంపూర్ణంగా సహకరిస్తామని ప్రకటించారు. వర్గీకరణ కోసం 24 ఏళ్లుగా ఉద్యమం జరుగుతున్నా ఎన్నడూ బంద్ పిలుపును ఇవ్వలేదని మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు.
టీఆర్‌ఎస్ కార్యకర్తలతో రైతు సమితులా?
రైతు సమన్వయ సమితులు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పునరావాస కేంద్రాలుగా మారాయని చాడ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతు సమన్వయ సమితుల పేరుతో అధికారాన్ని, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆరోపించారు.