
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా
హైదరాబాద్/ఢిల్లీ: ఢిల్లీకి వెళ్లాల్సిన తెలంగాణ అఖిలపక్షం వాయిదా పడింది. ఎల్లుండి అపాయింట్ మెంట్ ను ప్రధానమంత్రి కార్యాలయం శనివారం రాత్రి రద్దు చేసింది. తిరిగి అపాయింట్ మెంట్ ఎప్పుడనేది మళ్లీ చెబుతామని పీఎంవో అధికారులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై ఢిల్లీకి వెళ్లాల్సి ఉన్న తెలంగాణ అఖిలపక్షం తమ పర్యటనను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది.