
ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా వెంకటేశ్వర్లు
నల్లగొండ టూటౌన్ : కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా పెరిక వెంకటేశ్వర్లు రెండోసారి నియమితులయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షుడు సమావేశంలో ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్ కొప్పుల రాజు, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా సోమవారం నియామక పత్రాన్ని వెంకటేశ్వర్లు అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి పాటు పడుతానని తెలిపారు. రాష్ట్ర ఎస్సీ విభాగం చైర్మన్ ఆరెపల్లి మోహన్, సహకరించిన పార్టీ సీనియర్ నేతలు కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, బూడిద భిక్షమయ్యగౌడ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.