ఎస్సీ వర్గీకరణను మరిచిపోయారా?
సీఎంకు రేవంత్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్ష బృందాన్ని కేంద్రం వద్దకు తీసుకుపోతామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఆ విషయం మరిచిపోయారా అని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కాలయాపన ద్వారా వర్గీకరణను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష బృందాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలని, ప్రస్తుత శాసనసభ సమావేశాలలోపే దీనిపై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సీఎంకు శుక్రవారం రేవంత్ బహిరంగ లేఖ రాశారు.