
కుట్రతోనే ప్రధాని అపాయింట్‌మెంట్ రద్దు
పిడమర్తి రవి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీక రణ బిల్లును పార్లమెం ట్‌లో ప్రవేశపెట్టాలని కోరేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధం కాగా, చివరి క్షణంలో ప్రధాని అపాయింట్‌మెం ట్ రద్దు చేసుకోవడం వెనక ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాది గ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుట్ర ఉందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు.
వర్గీకర ణ ఇప్పుడే జరిగితే క్రెడిట్ అంతా టీఆర్ ఎస్‌కు దక్కుతుందన్న అక్కసుతో కుట్రలు జరిపి అపాయింట్‌మెంట్ రద్దు చేయించా రన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిర్ణయం తర్వాత మాదిగ లంతా టీఆర్‌ఎస్‌వైపు మొగ్గు చూపారని, వారంతా కేసీఆర్‌తో కలిసిపోతారన్న అక్కసుతో అపాయింట్ మెంట్ రద్దు చేయించారన్నారు.