classification bill
-
కుట్రతోనే ప్రధాని అపాయింట్మెంట్ రద్దు
పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీక రణ బిల్లును పార్లమెం ట్లో ప్రవేశపెట్టాలని కోరేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధం కాగా, చివరి క్షణంలో ప్రధాని అపాయింట్మెం ట్ రద్దు చేసుకోవడం వెనక ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాది గ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుట్ర ఉందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. వర్గీకర ణ ఇప్పుడే జరిగితే క్రెడిట్ అంతా టీఆర్ ఎస్‌కు దక్కుతుందన్న అక్కసుతో కుట్రలు జరిపి అపాయింట్మెంట్ రద్దు చేయించా రన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిర్ణయం తర్వాత మాదిగ లంతా టీఆర్ఎస్వైపు మొగ్గు చూపారని, వారంతా కేసీఆర్‌తో కలిసిపోతారన్న అక్కసుతో అపాయింట్ మెంట్ రద్దు చేయించారన్నారు. -
ధర్మయుద్ధమే అంతిమ యుద్ధం: మంద కృష్ణ
-
ధర్మయుద్ధమే అంతిమ యుద్ధం
• ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టాలి • మీట్ ద ప్రెస్‌లో ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ సాక్షి, హైదరాబాద్: తరాలుగా నలుగుతున్న మాదిగల వర్గీకరణను సాధించే క్రమంలో ఆదివారం నిర్వహించనున్న ‘ధర్మయుద్ధ’మే అంతిమ యుద్ధమని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన దళిత కులాలు వర్గీకరణతోనే లబ్ధి పొందుతాయని ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ పేర్కొన్నారు. ఈనెల 27న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్సలో తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభ ద్వారా వర్గీకరణ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వానికి చాటిచెబుతామని స్పష్టం చేశారు. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘దళితులకు కేటారుుంచిన రిజర్వేషన్లు కొన్నివర్గాలకే న్యాయం చేశారుు. ముఖ్యంగా మాదిగ ఉపకులాలకు ఈ ఫలాలు అందలేదు. రిజర్వేషన్లను అన్ని కులాలు సమానంగా ఉపయోగించుకోలేదని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. కానీ రాజ్యాంగంలో ఈ అంశాన్ని పొందుపర్చకపోవడంతో ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది’అని పేర్కొన్నారు. లక్షలాది మందితో చేపట్టే ఈ సభ ద్వారా కేంద్రం తప్పకుండా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యుద్ధాన్ని అంతిమ పోరాటంగా భావించాలని, ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేలా రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకురావాలన్నారు. దొరకని సీఎం అపారుుంట్‌మెంట్ జాతీయ స్థారుులో అన్ని రాజకీయ పార్టీలను సభకు రావాల్సిందిగా ఆహ్వానించామన్నారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సైతం పిలుస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌లో సభ జరుగుతున్నందున సీఎం కేసీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు ప్రయత్నించామని, కానీ ఇప్పటికీ ఆయన అపారుుంట్‌మెంట్ దొరకలేదన్నారు. శనివారం సాయంత్రం వరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీజేయూ అధ్యక్షుడు కప్పర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.