Pidamarti Ravi
-
కుట్రతోనే ప్రధాని అపాయింట్మెంట్ రద్దు
పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ వర్గీక రణ బిల్లును పార్లమెం ట్లో ప్రవేశపెట్టాలని కోరేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లేందుకు సిద్ధం కాగా, చివరి క్షణంలో ప్రధాని అపాయింట్మెం ట్ రద్దు చేసుకోవడం వెనక ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాది గ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుట్ర ఉందని తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ఆరోపించారు. వర్గీకర ణ ఇప్పుడే జరిగితే క్రెడిట్ అంతా టీఆర్ ఎస్‌కు దక్కుతుందన్న అక్కసుతో కుట్రలు జరిపి అపాయింట్మెంట్ రద్దు చేయించా రన్నారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నిర్ణయం తర్వాత మాదిగ లంతా టీఆర్ఎస్వైపు మొగ్గు చూపారని, వారంతా కేసీఆర్‌తో కలిసిపోతారన్న అక్కసుతో అపాయింట్ మెంట్ రద్దు చేయించారన్నారు. -
జేఏసీని ముక్కలు చేసింది కోదండరామే
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విద్యార్థులకు ప్రొఫెసర్ కోదండరాం చేసిందేమీ లేదని, జేఏసీని ముక్కలు చేసి 99 జేఏసీలు చేసిన ఘనత ఆయనదేనని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి విమర్శించారు. విద్యార్థుల వల్లే తెలం గాణ రాష్ట్రం సిద్ధించిందని ఇప్పటికైనా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. తన పక్కన ఉన్నవారికి, అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్న కోదండరాం, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల గురించి ఏమాత్రం ఆలోచించలేదన్నారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, బీజేపీల నుంచి టికెట్లు ఇప్పిస్తానని విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కోదండరాంతో ఉన్న వాళ్లంతా టీడీపీ, బీజేపీకి చెందిన విద్యార్థులేనన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్‌రెడ్డి కూడా ఆంధ్రా నేతల పక్షాన చేరలేదా అని రవి ప్రశ్నించారు. ఏపీ నాయకుల మోచేతి నీళ్లు తాగి కాంట్రాక్టులు తెచ్చుకుంటున్నారన్నారు. -
పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
బిల్లుకు చట్టబద్ధత కల్పించేంత వరకు పోరాటం ఆగదు ఎస్సీ కారొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి చేవెళ్ల: పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి.. చట్టబద్ధత కల్పించేంతవరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఎస్సీ కారొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. వర్గీకరణే ప్రధాన ఎజెండాగా ఆగస్టు 8,9,10 తేదీల్లో నిర్వహించతలపెట్టిన ‘ఢిల్లీపై మాదిగల దండయాత్ర‘ పోస్టర్‌ను ఆయన రాష్ట్ర మాదిగ జేఏసీ కన్వీనర్ జోగు అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడమర్తి రవి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా.. కేంద్రం ప్రభుత్వం మాత్రం బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి తీవ్ర జాప్యం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే మాదిగలకు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, వర్గీకరణతోనే తమకు న్యాయం జరుగుతుందని మాదిగలు ఆశిస్తున్నారని చెప్పారు. దామాషా ప్రకారం మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బిల్లుకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. తాము ఇతరులకు అన్యాయం చేయాలని కోరుకోవడం లేదని, తమకు మాత్రం న్యాయం చేయాలని అర్థిస్తున్నామని తెలిపారు. పార్లమెంటులో వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించేంతవరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. టీఎంజేఏసీ రాష్ట్ర కన్వీనర్ జోగు అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరుతూ వచ్చే నెలలో 8 నుంచి 10 రోజులపాటు ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు రాష్ట్రం నలుమూలల నుంచి అధికసంఖ్యలో హాజరు కావాలని కోరారు. పోరాడితేనే హక్కులను సాధించుకోగలుగుతామన్నారు. వర్గీకరణ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీఎంజేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు పెరికె కరణ్ జయరాజ్, గద్దెల అంజిబాబు, తలారి వెంకటేష్, ఈరని మహేష్, చంటి, బాబు, చరణ్, భూపాల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి
చేవెళ్లః అనాదిగా వివక్షకు గురవుతున్న మాదిగలకు రాజ్యాంగపరమైన హక్కుల సాధనకోసం వచ్చే పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. వచ్చేనెల 8,9,10 తేదీలలో ఛలో ఢిల్లీ కార్యక్రమ సన్నాహాక సమావేశాన్ని జిల్లా స్థాయిలో చేవెళ్లలోని అతిథిగృహంలో ఆదివారం తెలంగాణ మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు జోగు అశోక్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పిడమర్తి రవి మాట్లాడుతూ...రాజ్యాంగ పరంగా తమకు ఎన్నో హక్కులు సంక్రమించాల్సి ఉన్నప్పటికీ వర్గీకరణ బిల్లు చట్టబద్ధత కాకపోవడంతో తాము అన్ని విధాలా అన్యాయాలను ఎదుర్కొంటున్నామని చెప్పారు. గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటంచేసిన మాదిగనేతలకు చిత్తశుద్ధిలేదని మందక్రిష్ణమాదిగను ఉద్ధేశించి పేర్కొన్నారు. ఆయన హాయాంలో మాదిగలకు సాధించిపెట్టిందేమీలేదని విమర్శించారు. తమ ఉధ్యమమంతా మాలలపై కాదని తమ హక్కులను తాము కాపాడుకునేందుకు, పరిరక్షించుకునేందుకని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం మాదిగలకు రావాల్సిన ఉద్యోగాలు రావడంలేదన్నారు. దీంతో తాము వర్గీకరణ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణపై సమాజంలోని మేధావులంతా సహకరించి మద్ధతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో విషయాలపై పోరాటం చేస్తున్న కోదండరాం ఎస్సీ వర్గీకరణపై తమ వైఖరిని స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. ఏనాడూ ఆయన ఎస్సీ వర్గీకరణ బిల్లుకోసం మాట్లాడలేదని, దీనిపై తాము తీవ్రం అసంతృప్తితో ఉన్నామని చెప్పారు. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ వచ్చేనెల ఢిల్లీ యాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు జోగు అశోక్‌కుమార్ మాట్లాడుతూ పిడమర్తి రవి నాయకత్వంలో తాము వర్గీకరణ సాధించడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దీర్ఘకాలంగా ఉధ్యమం చేస్తున్నా సాధించిందేమీలేదన్నారు. మాదిగలంతా ఏకతాటిపైకి వచ్చి వర్గీకరణ సాధించుకునేవరకు పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ యువజన జేఏసీ చైర్మన్ పెరికె కరణ్‌జయరాజ్, రాష్ట్ర విద్యార్థి జేఏసీ చైర్మన్ గజ్జెల అంజిబాబు, గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షులు చిరుమూర్తి రాజు, తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ పేర పబ్బం
మంద కృష్ణపై పిడమర్తి రవి ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రెండేళ్లుగా టీఆర్ఎస్ నేతృత్వంలో ప్రభుత్వ పాలన బ్రహ్మాండంగా సాగుతున్నా మంద కృష్ణ మాదిగ అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మంద కృష్ణ నిరంతరం మండిస్తూ తన పబ్బం గడుపుకొంటున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఇంటికి దండయాత్ర చేస్తామంటే తాము చూస్తూ ఊరుకోమన్నారు. ఎమ్మార్పీఎస్ జెండాలు పట్టుకుని చంద్రబాబుకు తెలంగాణలో స్వాగతం పలికావ్.. మరి ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారా అని మందకృష్ణను ప్రశ్నించారు. ‘నీకు చదువు రాదు. ఉద్యోగం లేదు. ఉద్యమం చదువుకున్న వారితో, విద్యార్థులతో చేయాలి. నువ్వు ఓట్లు వేయమని చెప్పింది మోదీ, చంద్రబాబులకు. కాబట్టి ఆ ఇద్దరి ఇళ్లపైకి దండయాత్ర చేయాలి. సీఎం కేసీఆర్ ఇంటిపైకి కాదు..’ అని రవి హితవు పలికారు. పుటం పురుషోత్తం, మందుల వరలక్ష్మీ పాల్గొన్నారు. -
సత్తుపల్లిలో ఫుట్‌బాల్ క్లబ్ ఏర్పాటు
సత్తుపల్లి(ఖమ్మం): ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి జేవీఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం స్థానిక ఫుట్‌బాల్ క్రీడాకారులందరు కలిసి సత్తుపల్లి ఫుట్‌బాల్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు. ఈ క్లబ్‌ను ఏర్పాటు చేసిన వారికి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తుందని.. ఈ క్లబ్‌కు తన సహాయ సహకారాలు అందిస్తామన్నారు. -
అధికారుల నిర్లక్ష్యంతోనే పేదలకు అందని భూమి
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి నర్సింహులపేట: అధికారుల నిర్లక్ష్యంతోనే నిరుపేద ఎస్సీలకు భూమి అందడం లేదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలంలోని దంతాలపల్లిలో శని వారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణిలో అధికారులు సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతో జాప్యం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో 6 లక్షల ఎస్సీ కుటుంబాలను గుర్తించామని, 18 లక్షల ఎకరాల భూమిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 10 వేల ఎకరాల భూమిని అమ్మడానికి రైతులు ముందుకు వచ్చారని, అరుుతే తదుపరి చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. 2013-14లో రూ.100 కోట్లు, 2014-15కు రూ.184 కోట్లను ఎస్సీల భూ పంపిణికి ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. వచ్చే నాలుగేళ్లలో అర్హులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని స్పష్టం చేశారు. -
దళితుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తా
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పిడమర్తి రవి సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో దళితుల అ భ్యున్నతికి, నిరుద్యోగ యువతకు ఉపాధిని అం దించేందుకు నిర్విరామంగా కృషిచేస్తానని పిడమర్తి రవి తెలిపారు. తెలంగాణ షెడ్యూల్డ్ కులా ల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ చైర్మన్‌గా నియమితులైన రవి శనివారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.220 కోట్లు కేటాయిస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం 1184.15 కోట్లు కేటాయించిందన్నా రు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిం చిన రవిని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ఓయూ విద్యార్థులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించారు. అంతకుముందు కార్యాలయం వద్ద ఎస్సీ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ అండ్ ఎమ్డీ జయరాజ్, జనరల్ మేనేజర్ కరుణాకర్‌లు ఆయనకు స్వాగతం పలికారు. భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంక్షేమభవన్‌లో ఆయన చిత్రపటానికి రవి, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
తొలి చాన్స్
పదవుల పందేరంలో జిల్లాకు తొలి ప్రాధాన్యం * ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవి * మంత్రివర్గంలో జిల్లా స్థానంపై వీడని సస్పెన్స్ సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రత్యేక తెలంగాణలో రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. మంత్రివర్గంలో జిల్లాకు చోటివ్వడానికి ముందే నామినేటెడ్ పదవుల్లో కీలక అవకాశం కల్పించారు. రాష్ట్రస్థాయిలో అత్యంత కీలకమైన షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్గాగార్లకు చెందిన పిడమర్తి రవిని నియమించారు. రవి నియామకంపై హర్షం జిల్లాకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించడం ఇది రెండోసారి. 1992లో పాలేరు శాసనసభ్యుడు, మాజీమంత్రి సంభాని చంద్రశేఖర్‌ను అప్పటి ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహతో సహా అనేక మంది ప్రముఖులు ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. అత్యంత కీలకమైన కార్పొరేషన్లో ఎస్సీ కార్పొరేషన్ ఒకటి. ఇంతటి కీలక పదవి తెలంగాణ ఉద్యమంలో ఓయూ జేఏసీ కన్వీనర్‌గా క్రీయాశీలకంగా వ్యవహరించిన పిడమర్తి రవికి దక్కడంపై జిల్లావ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రవి జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తూనే జిల్లాతో అనుబంధం పెంచుకున్న రవి రాజకీయ ఎదుగుదలకు ఇదో తొలిమెట్టుగా ఆ పార్టీ జిల్లా నేతలు అభివర్ణిస్తున్నారు. మంత్రి పదవిపై చిగురిస్తున్న ఆశలు పిడమర్తి రవికి తొలి నామినేటెడ్ పోస్టు దక్కడంతో ఇక మిగిలింది మంత్రి పదవేనని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మంత్రి వర్గంలో జిల్లా నేతకు ఎప్పుడు స్థానం దక్కుతుందోనని ఆ పార్టీతో పాటు జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమశక్తిని చాటిన టీఆర్ఎస్ శ్రేణుల సాధక బాధకాలను తీర్చే నాయకుడే కరువయ్యారన్న భావన రవి నియామకంతో కొంత తీరే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇక పదవుల పందేరానికి కేసీఆర్ శ్రీకారం చుట్టడంతో జిల్లాకు చెందిన అనేకమంది పాత, కొత్త నేతలు నామినేటెడ్ పదవులు పొందేందుకు తమకున్న ప్రత్యేక అర్హతల జాబితాను చేతపట్టుకుని పైరవీలు మొదలుపెట్టారు. రవికి పదవి లభించడంతో తెలంగాణ ఉద్యమానికి ఆది నుంచి అండగా ఉన్నవారు ప్రాధాన్యం కోల్పోలేదనే భావన టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించినట్టయింది. ఇక జిల్లాలో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ పైనే నెలకొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు కావస్తున్నా జిల్లాకు మంత్రివర్గంలో చోటు లభించకపోవడంతో పార్టీ వర్గాల్లో కొంత నైరాశ్యం ఏర్పడింది. టీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఎన్నికైన జలగం వెంకట్రావుతో పాటు మూడు, నాలుగు నెలల క్రితం ఆ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల్లో ఒకరికి మంత్రి పదవి దక్కుతుందని ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. తుమ్మలకు మంత్రి పదవి ఖాయమైందని, ఇక ప్రమాణస్వీకారమే తరువాయి అని గతనెలలో టీఆర్ఎస్ శ్రేణులు చేసిన హడావిడి జిల్లాలో చర్చనీయాంశమైంది. తాజాగా మంత్రి వర్గ విస్తరణపై సన్నిహితులతో కేసీఆర్ చర్చలు జరిపారన్న ప్రచారం తుమ్మల అనుచరుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. పార్టీ పంథాలో పార్టీ... జిల్లాలోని వివిధ పార్టీల్లో ఉన్న కీలక నేతలు, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్ నుంచి వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన బాణోత్ మదన్‌లాల్, కోరం కనకయ్య టీఆర్ఎస్లో చేరారు. దీనివల్ల టీఆర్ఎస్కు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో మూడు స్థానాలు దక్కినట్లయింది. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రిపదవి లభించడం ఖాయమని ప్రచారం జరుగుతున్నా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం అటువంటి సంకేతాలు ఇవ్వకుండా ఈ పదవులపై ఆశ పెట్టుకున్న వారిని చిన్నబుచ్చకుండా మధ్యేమార్గంగా వ్యవహరిస్తోంది. సాధ్యమైనంత వరకు వాయిదాల పద్ధతినే పాటిస్తోందని టీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. మరోవైపు రాజకీయ సమీకరణల దృష్ట్యా జిల్లాకు రెండు మంత్రి పదవులు ఇవ్వలేని పక్షంలో కేబినెట్ స్థాయి హోదా కలిగిన మరో కీలక పదవిని జిల్లాకు అప్పగించే అవకాశాన్ని సైతం పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రవికి పదవి దక్కడంతో ఆ పార్టీకి చెందిన బీసీ నేతలు కూడా హైదరాబాద్‌కు క్యూ కట్టారు. జిల్లాలో బీసీ జనాభా ప్రాతిపదికగా తమకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రిని, పార్టీ కీలకనేతలను కలిసి కొందరు నేతలు అభ్యర్థించారు. అయితే కీలకమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి జిల్లాను వరించిన దృష్ట్యా మరో రాష్ట్రస్థాయి పోస్టు ఇప్పటికిప్పుడు లభించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయో చెప్పలేమని టీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఒకెత్తయితే జిల్లా నేతకు మంత్రి పదవి ఇస్తేనే గ్రౌండ్లెవల్లోనూ పార్టీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం ఆపార్టీ శ్రేణుల్లో ఉంది. -
ఎస్సీ సహకార సంస్థ చైర్మన్‌గా పిడమర్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ షెడ్యూల్ కులాల సహకారాభివృద్ధి సంస్థ (టీఎస్సీసీడీసీ) చైర్మన్‌గా పిడమర్తి రవిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లైంది. ఉద్యమం సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఆందోళనలకు నాయకత్వం వహించిన విద్యార్థి సంఘ నాయకుల్లో రవి ఒకరు. తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్‌గా కొనసాగుతున్న పిడమర్తికి నామినేటెడ్ పోస్టుల్లో తొలి ప్రాధాన్యం దక్కింది. వైస్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ టీఎస్సీసీడీసీ లిమిటెడ్‌కు సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. చైర్మన్ పదవీ స్వీకారం చేసిన తేదీ నుంచి రెండేళ్ల పాటు ఈ సంస్థ కాలపరిమితి ఉంటుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి (ఎఫ్ఏసీ) రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ కులాల సహకార ఆర్థిక సంస్థ లిమిటెడ్‌ను తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం మరో జీవోను కూడా జారీ చేసింది. ఈ నియామక ఉత్తర్వులను పిడమర్తి రవికి సీఎం కేసీఆర్ బుధవారం స్వయంగా సచివాలయంలో అందజేశారు. ఇది విద్యార్థి లోకానికే గుర్తింపు: రవి తెలంగాణ విద్యార్థి లోకానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇచ్చిన గుర్తింపే తన నియామకమని తెలంగాణ షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి సంస్థ(టీఎస్సీసీడీసీ) చైర్మన్‌గా నియమితుడైన పిడమర్తి రవి అన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిపోయిన తనకు మళ్లీ పిలిచి కేబినెట్ ర్యాంక్‌తో చైర్మన్ పదవిని కట్టబెట్టినందుకు ఆయన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సుబేదారి : తెలంగాణ ప్రభుత్వం మాదిగ, మాదిగ ఉపకులాలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిడమర్తి రవి కోరారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో బుధవా రం తెలంగాణ మాదిగ విద్యార్థి యువజన సదస్సు నిర్వహించా రు. సదస్సుకు ముఖ్యఅతిథిగా పిడమర్తి రవి హాజరై మాట్లాడారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఇందులో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత కల్పించడం ఎం తవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టీఎమార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ కోసం ముందుండి పోరాటాలు చేసిన మాదిగలకు టీఆర్ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని కోరారు. బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి కిశోర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేయూ ప్రొఫెసర్ సాంబయ్య, టి.మనోహర్, టీమాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వీరేందర్, చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణపతితో పాటు యాదగిరి, వెంకట్, రవి, మల్లేష్, విజయ్, కార్తీక్, మురళి, సుభాష్, సుధాకర్, చిరంజీవి పాల్గొన్నారు. -
విద్యార్థి నేతల్నిఎమ్మెల్యేలను చేస్తా: కేసీఆర్
విద్యార్థి నేతలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హామీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన విద్యార్థి నాయకుల్లో ముగ్గురు నలుగురినైనా ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలను చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. ఇంకో ముగ్గురు నలుగురిని ఎమ్మెల్సీలుగా చేయాల్సిన అవసరం కూడా ఉందన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణంలో ఉద్యమశక్తుల భాగస్వామ్యం అవసరమని చెప్పారు. పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు, బుల్లెట్ల దెబ్బలు తిన్న విద్యార్థుల భాగస్వామ్యం కావాలన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట ఎమ్మెల్యే వై. ఎల్లారెడ్డి, తెలంగాణ విద్యార్థి జేఏసీ చైర్మన్ పిడమర్తి రవి, వరంగల్ జిల్లా టీడీపీ మహిళా విభాగ అధ్యక్షురాలు ప్రేమలతారెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థి నాయకులు బుధవారం కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ నేతలు కె.కేశవరావు, జగదీశ్వరరెడ్డి, కడియం శ్రీహరి, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కేసీఆర్ ఏమన్నారంటే... ఎల్లారెడ్డి ఈ దఫా ఎన్నికల్లో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉంటారు. ఇప్పటివరకు ఆ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా వ్యవహరించిన దేవరి మల్లప్పకు పార్టీకి వచ్చే మొదటి అవకాశంలోనే ఎమ్మెల్సీగా చేస్తా. విద్యార్థి నాయకుడు పిడమర్తి రవిని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీలో ఉంచుతా. రవి విద్యార్థి టైగర్, ఎక్కడి నుంచి పోటీ చేసినా సులభంగా గెలుపొందగలరు. రవిని పార్టీలోకి రమ్మని నేనే స్వయంగా ఆహ్వానించా. ఉద్యమంలో పాల్గొన్న జిల్లాల్లోని విద్యార్థి నాయకులకు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో అవకాశమిస్తా. ఎన్నికల తరువాత తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్సే. ఉద్యమం చేసి అధికారంలో వచ్చినవారే ఇక్కడి ప్రజల బాధలు తెలుసుకోగలరు. రాష్ట్ర పునర్ నిర్మాణం బ్రహ్మాండంగా చేయగలరు. ఈవేళ అనేకపార్టీలు, బహురూపులు, గజకర్ణ గోకర్ణ, టక్కుటమార విద్యలతో ఇక్కడి ప్రజలను గందరగోళ పర్చడానికి వస్తున్నారు. కాబట్టి టీఆర్ఎస్ను బలోపేతం చేసుకొని ముందుకుపోవాలంటే ఎన్నికలలో విజయం సాధించాల్సిన అవసరం ఉంది. 14 ఏళ్ల ఉద్యమకాలంలో నేను ఏనాడూ విరాళాలు అడగలేదు. ఇప్పుడు సాధారణ ఎన్నికలకు పోతున్న టీఆర్ఎస్ పార్టీకి విరాళాలివ్వమని ప్రజలను అభ్యర్థిస్తున్నా. పది రూపాయలు, ఆపైన మీ ఇష్టం. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో బ్యాంకు ఆఫ్ బరోడా శాఖలో పార్టీ పేరుతో ఉన్న 266- 101- 0000-2075 ఎకౌంట్‌కు పంపండి. జిల్లా జడ్జీల కోటాలో హైకోర్టు న్యాయమూర్తులను చేసేందుకు కొలీజియం ఏర్పాటు చేయబోతున్నట్టు నాకు సమాచారం అందింది. హైదరాబాద్‌లో జిల్లా జడ్జీ హోదా ఉన్నవారు 85 మంది. అందులో 75 మంది ఆంధ్రోళ్లే. తెలంగాణ వారు పది మందే. ఇలాంటి అన్యాయం జరుగుతుందనే తెలంగాణ కోరుకుంటున్నం. అందుకే ఇప్పుడు కొలీజియం నిర్వహించవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతున్నా. అందుకోసం ఆయనకు లేఖ రాస్తా. ఆ లేఖను రాష్ట్రపతికి కూడా పంపుతా. -
టీఆర్ఎస్లో చేరిన టీఎస్‌జేఏసీ నాయకులు