
దళితుల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తా
- ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పిడమర్తి రవి
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో దళితుల అ భ్యున్నతికి, నిరుద్యోగ యువతకు ఉపాధిని అం దించేందుకు నిర్విరామంగా కృషిచేస్తానని పిడమర్తి రవి తెలిపారు. తెలంగాణ షెడ్యూల్డ్ కులా ల సహకార అభివృద్ధి సంస్థ లిమిటెడ్ చైర్మన్‌గా నియమితులైన రవి శనివారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో రవి మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.220 కోట్లు కేటాయిస్తే, టీఆర్‌ఎస్ ప్రభుత్వం 1184.15 కోట్లు కేటాయించిందన్నా రు. కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిం చిన రవిని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, ఎంపీ కె.కేశవరావు, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, ఓయూ విద్యార్థులు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సన్మానించారు.
అంతకుముందు కార్యాలయం వద్ద ఎస్సీ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ అండ్ ఎమ్‌డీ జయరాజ్, జనరల్ మేనేజర్ కరుణాకర్‌లు ఆయనకు స్వాగతం పలికారు. భారతరత్న బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా సంక్షేమభవన్‌లో ఆయన చిత్రపటానికి రవి, ఇతర అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.