మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
సుబేదారి : తెలంగాణ ప్రభుత్వం మాదిగ, మాదిగ ఉపకులాలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిడమర్తి రవి కోరారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆడిటోరియంలో బుధవా రం తెలంగాణ మాదిగ విద్యార్థి యువజన సదస్సు నిర్వహించా రు. సదస్సుకు ముఖ్యఅతిథిగా పిడమర్తి రవి హాజరై మాట్లాడారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ పార్టీ ఇందులో ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత కల్పించడం ఎం తవరకు సమంజసమని ప్రశ్నించారు.
రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఉద్యోగ, ఉపాధి, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు కల్పిం చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టీఎమార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల బిక్షపతి మాదిగ మాట్లాడుతూ తెలంగాణ కోసం ముందుండి పోరాటాలు చేసిన మాదిగలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించాలని కోరారు. బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు దుప్పటి కిశోర్ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేయూ ప్రొఫెసర్ సాంబయ్య, టి.మనోహర్, టీమాదిగ యూత్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ వీరేందర్, చిందు హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు గణపతితో పాటు యాదగిరి, వెంకట్, రవి, మల్లేష్, విజయ్, కార్తీక్, మురళి, సుభాష్, సుధాకర్, చిరంజీవి పాల్గొన్నారు.