తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీవరణ పై రగడ చోటు చేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయంలో వాయిదా తీర్మానంపై చర్చించాలని పోడియం వద్ద ఆందోళనకు దిగిన విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. మంగళవారం శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు ఆందోళన మొదలు పెట్టారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని పట్టుబట్టారు.