సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీ ను ముట్టడించేందుకు బుధవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ప్రయత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. మల్కాపురం గ్రామం నుంచి వచ్చిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలంతా అసెంబ్లీలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగింది.
సీఎం చంద్రబాబు తమకు అన్యాయం చేస్తున్నారని.. ఎస్సీ వర్గీకరణ బిల్లు త్వరగా పెట్టాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా 30 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మల్కాపురం గ్రామంలోని ఓ ఇంట్లో మంగళవారం నుంచి సుమారు 30 మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రహస్యంగా మకాం వేసి ఉన్నారని పోలీసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment