చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి: మందకృష్ణ | Manda Krishna Madiga Fires On AP CM Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి: మందకృష్ణ

Published Thu, Jun 1 2017 3:10 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి: మందకృష్ణ - Sakshi

చంద్రబాబు స్పష్టత ఇవ్వాలి: మందకృష్ణ

విశాఖపట్టణం: ఏపీ సీఎం చంద్రబాబుపై ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. చంద్రబాబు టీడీపీకి జాతీయ అధ్యక్షుడా, రాష్ట్ర అధ్యక్షుడో స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఇటీవల జరిగిన మహానాడులో విశాఖ సాక్షిగా చంద్రబాబు మాదిగలను మోసం చేశారని ఆరోపించారు.

ఎస్సీ వర్గీకరణ పై మాట్లాడి మహానాడులో తీర్మానం పెట్టకపోవడం, మాదిగలను మోసం చేయడమేనన్నారు. మాలలను అందలం ఎక్కించి మాదిగలను విస్మరిస్తున్నారని విమర్శించారు. వర్గీకరణకు కట్టుబడక పోతే చంద్రబాబు మాదిగల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. జూలై 7వ తేదీన అమరావతిలో పదిలక్షల మందితో కురుక్షేత్ర మహాసభ జరుపుతామని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement