సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 11 నుంచి 14 తేదీల మధ్య ఏదో ఒక రోజు ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. నిజానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ మూడో వారంలోనే ప్రారంభమవ్వాలి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా సమావేశాలు ప్రారంభం కావడం ఆలస్యమవుతోందని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి.
కాగా సమావేశాల తేదీల్ని నిర్ణయించే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇంకా భేటీ కాలేదు. డిసెంబర్ 9, 14 తేదీల్లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో పార్లమెంట్ సమావేశాలు డిసెంబర్ 11– 14 మధ్యలో ప్రారంభం కావచ్చని లోక్‌సభ వర్గాలు తెలిపాయి. సభ నిర్వహణకు కేంద్రం సుముఖంగా లేదని, శీతాకాల సమావేశాల్ని రద్దు చేసే ఆలోచనలో ఉందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలుచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment