రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్‌లో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు.
- 30 వరకు హైదరాబాద్‌లో విడిది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ డిసెంబర్‌లో హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి హైదరాబాద్‌లో విడిది చేయటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ 18 నుంచి 30 వరకు శీతాకాల విడిదికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌లో బస చేస్తారు. ఇక్కడి నుంచే దక్షిణాది రాష్ట్రాల్లో వివిధ పర్యటనలకు హాజరవుతారు. రాష్ట్రపతి భవన్‌లోనే పలువురు ప్రముఖులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని, తేదీల వివరాలను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది.