
రేపు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రేపు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు తెలిపారు. రేపటి నుంచి జూలై 8 వ తేదీ వరకు సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. జూలై 1న ఆయన తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారని సమాచారం.
జూలై 3న మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు రచించిన 'ఉనికి' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి గెస్ట్ హౌస్ లో జూలై 6వ తేదీన 'నక్షత్ర వాటిక'ను ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించనున్నారు.