ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు...! | MPs Rode to Parliament in Style | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు...!

Published Fri, Dec 15 2017 12:26 PM | Last Updated on Fri, Dec 15 2017 1:03 PM

MPs Rode to Parliament in Style - Sakshi

ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వస్తున్న దుష్యంత్‌ సింగ్‌ చౌతాలా

సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల తొలిరోజన కొందరు సభ్యులు.. అనూహ్య రీతిలో సభకు వచ్చారు. సైకిల్‌, ట్రాక్టర్‌, బుల్లెట్‌పై ఇలా.. ఒక్కో వాహనం మీద లోక్‌సభకు వచ్చారు. రోడ్లపై వీరిని చూసిన జనాలు.. వీరిని ఒకింత ఆశ్చర్యంగా గమనించడం విశేషం​.

ఇండియన్‌ లోక్‌దళ్‌ పార్టీకి చెందిన ఎంపీ దుష్యంత్‌ చౌతాలా... ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు.  ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వస్తున్న చౌతాలాను ఇతర సభ్యులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యంతో గమనించారు.
చౌతాలా ఇలా పార్లమెంట్‌కు రావడం కొత్తేమీ కాదు. గతంలో పొల్యూషన్‌ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి విధానాన్ని వ్యతిరేకిస్తూ గుర్రంపై పార్లమెంట్‌కు వచ్చారు.

కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, బీజేపీ ఎంపీలు మన్షుఖ్‌ ఎల్‌ మాండవీయ, మనోజ్‌ తివారీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు హాజరయ్యారు.

కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎంపీ రంజీత్‌ రంజన్‌ ఆరెంజ్‌ కలర్‌లోని హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళల దినోత్సం కాబట్టి.. మహిళా శక్తిని చాటేందుకు హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్‌లోని సుపాల్‌ నియోజకవర్గానికి 42 ఏళ్ల రంజిత్‌ రంజన్‌ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

ఇదిలా ఉండగా శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. జనవరి 5 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్‌ తలాక్‌ సహా 14 ​కీలక బిల్లులు చర్చకు రానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

సౌకిల్‌పై పార్లమెంట్‌కు వస్తున్న కేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌

2
2/2

హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ రంజీత్‌ రంజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement