Harley-Davidson
-
బైక్ కొనుగోలుపై రూ.5.30 లక్షలు డిస్కౌంట్.. వివరాలు
పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ బైక్ తయారీ సంస్థ 'హార్లే డేవిడ్సన్' చేరింది. హార్లే డేవిడ్సన్ ప్రస్తుతం ఎంపిక చేసిన కొన్ని మోడల్స్ మీద భారీ డిస్కౌంట్స్ అందిస్తోంది. పాన్ అమెరికా 1250 స్పెషల్ అడ్వెంచర్ టూరర్ మీద సంస్థ రూ. 3.25 లక్షలు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ బైక్ ధర రూ. 21.24 లక్షలకు చేరింది. స్పోర్ట్‌స్టర్ ఎస్ కొనుగోలు మీద కూడా ఇదే డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ కొనాలనుకునే వారు రూ. 15.54 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. నైట్‌స్టర్ మీద ప్రస్తుతం రూ. 5.25 లక్షల తగ్గింపు అందుబాటులో ఉంది. దీనిని ఇప్పుడు రూ. 12.24 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. నైట్‌స్టర్ స్పెషల్ బైక్ మీద కంపెనీ ఏకంగా రూ.5.30 లక్షల డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకునే వారు రూ. 12.99 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. హార్లే డేవిడ్సన్ 2022 మోడల్స్ మీద కూడా డిస్కౌంట్స్ అందిస్తోంది. ఇందులో 2022 నైట్‌స్టర్ మీద రూ. 4.30 లక్షలు, స్పోర్ట్‌స్టర్ ఎస్ మీద రూ. 4.45 లక్షలు, పాన్ అమెరికా స్పెషల్ మీద రూ. 4.90 లక్షల తగ్గింపు లభిస్తుంది. Note: కంపెనీ అందించే డిస్కౌంట్స్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే కాకుండా, ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. కస్టమర్లు ఖచ్చితమైన డిస్కౌంట్స్ తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
త్వరలో మార్కెట్లోకి హ్యార్లీ డేవిడ్సన్ సూపర్ ఎలక్ట్రిక్ బైక్స్
న్యూఢిల్లీ: దేశంలో ఇందన ధరలు విపరీతంగా పెరుగుతున్న కారణంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రోజురోజుకు డిమాండ్ పెరిగిపోతోంది. కొద్దీ కాలం నుంచే ఎలక్ట్రిక్ బైక్స్ తయారీ విషయంలో పెద్ద పెద్ద కంపెనీలు అటు వైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ప్రఖ్యాత అమెరికన్ కంపెనీ హ్యార్లీ డేవిడ్సన్ కూడా వచ్చి చేరింది. అయితే, వినియోగదారులు మాత్రం స్టైల్ విషయంలోనూ, వాల్యూ ఫర్ మనీ వంటి ఆకట్టుకునే వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ లైవ్ బ్రాండెడ్ సూపర్ మోటార్ సైకిల్ ను జులై8న జరిగే అంతర్జాతీయ మోటార్ సైకిల్ షోలో దీనిని ప్రదర్శించనున్నట్లు అధికారిక వెబ్ సైట్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ లైవ్ వైర్ ఎలక్ట్రిక్ బ్రాండ్ కింద వచ్చే అన్నీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో అందించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేలా భవిష్యత్తు ప్రణాళిక రూపొందిస్తున్నామని జోచెన్ ప్రకటనలో తెలిపారు. ఈ నూతన బ్రాండ్ మొదట అర్బన్ బైక్స్ పై దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. హార్లీ డేవిడ్సన్ కు వచ్చే లాభంలో ఎక్కువ భాగం స్మాలర్, లైటర్ మోడళ్ల బైక్స్ కంటే సుదూర క్రూయిజర్లే ఆక్రమించాయి అని అన్నారు. దీని ధర వచ్చేసి 29,799 డాలర్ల(రూ.21,88,825.95 లక్షలు) నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నూతన మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలు తెలియదు. హ్యార్లీ బోర్డు మెంబర్ గా పనిచేస్తున్న జోచెన్ అసలు సిసలైన విద్యుత్ మోటార్ సైకిల్ తయారీకి శ్రీకారం చుట్టారు. చదవండి: కోవిడ్‌లోనూ కొనుగోళ్లు, విలీనాల జోష్ -
ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు...!
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల తొలిరోజన కొందరు సభ్యులు.. అనూహ్య రీతిలో సభకు వచ్చారు. సైకిల్, ట్రాక్టర్, బుల్లెట్‌పై ఇలా.. ఒక్కో వాహనం మీద లోక్‌సభకు వచ్చారు. రోడ్లపై వీరిని చూసిన జనాలు.. వీరిని ఒకింత ఆశ్చర్యంగా గమనించడం విశేషం. ఇండియన్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుష్యంత్ చౌతాలా... ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వస్తున్న చౌతాలాను ఇతర సభ్యులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యంతో గమనించారు. చౌతాలా ఇలా పార్లమెంట్‌కు రావడం కొత్తేమీ కాదు. గతంలో పొల్యూషన్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి విధానాన్ని వ్యతిరేకిస్తూ గుర్రంపై పార్లమెంట్‌కు వచ్చారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ ఎంపీలు మన్షుఖ్ ఎల్ మాండవీయ, మనోజ్ తివారీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎంపీ రంజీత్ రంజన్ ఆరెంజ్ కలర్లోని హార్లీ డేవిడ్సన్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళల దినోత్సం కాబట్టి.. మహిళా శక్తిని చాటేందుకు హార్లీడేవిడ్సన్ బైక్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్‌లోని సుపాల్ నియోజకవర్గానికి 42 ఏళ్ల రంజిత్ రంజన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. జనవరి 5 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్ తలాక్ సహా 14 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. -
డుకాటి కొనుగోలు రేసులోకి మరో దిగ్గజం
ఇటాలియన్ మోటార్ సైకిల్ ప్రత్యర్థి డుకాటిని సొంతం చేసుకోవడం కోసం అమెరికా మోటార్ సైకిల్ దిగ్గజం హార్లే-డేవిడ్ సన్ కొనుగోలు రేసులోకి వచ్చింది. మోటార్ సైకిలింగ్ అత్యంత ఫేమస్ అయిన ఈ రెండు సంస్థలు ఓ డీల్ కుద్చుబోతున్నాయని తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఈ డీల్ 1.5 బిలియన్ యూరోల(రూ.10,812కోట్లకు పైగా) వరకు ఉండొచ్చని సమాచారం. డుకాటిని జర్మన్ కారు తయారీదారు ఫోక్స్ వాగన్ విక్రయానికి పెట్టింది. ఈ విక్రయానికి దేశీయ మోటార్ సైకిల్ తయారీదారి బజాజ్ ఆటోతో పాటు పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేశాయి. హీరో మోటార్ కార్పొ, తన ప్రత్యర్థి టీవీఎస్ మోటార్ కూడా డుకాటి కొనుగోలు చేయాలనుకుని, తర్వాత విరమించుకున్నాయి. అయితే ఫోక్స్ వాగన్ లో అత్యంత పాపులర్ లేబర్ యూనియన్లు ఈ విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా దీన్ని కొనుగోలుచేయాలని ఆసక్తి కనబరిచింది. ప్రస్తుతం హార్లే-డేవిడ్ సన్ కూడా ఈ కొనుగోలురేసులోకి వచ్చేసింది. డీజల్ ఉద్గార కుంభకోణం వోక్స్వ్యాగన్ గ్రూపు మీద తీవ్ర ప్రభావం చూపింది. దీని నుండి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వోక్స్వ్యాగన్ తమ డుకాటి టూ వీలర్ల తయారీ సంస్థను విక్రయించేందుకు సిద్దమైంది. ఖరీదైన మరియు శక్తివంతమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి మొత్తం విలువ రూ. 10,500 కోట్ల రుపాయలుగా ఉంది. 1926లో లాంచ్ అయిన ఈ డుకాటిని, ఆడి కు చెందిన వోక్స్వ్యాగన్ గ్రూపు 2012 లో 6,000 కోట్ల రుపాయలకు కొనుగోలు చేసింది. ఆ తరువాత కాలంలో 800సీసీ నుండి 1,200సీసీ సామర్థ్యం రేంజ్ ఉన్న మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసింది. ప్రస్తుతం హార్లే డేవిడ్ సన్ కు అమెరికాలో సగానికి పైగా మార్కెట్ కలిగి ఉంది. -
హార్లీ డేవిడ్ సన్ నుంచి 2 కొత్త బైకులు
ధర శ్రేణి రూ.9.7 లక్షలు-32.81 లక్షలు న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం బైక్స్ తయారీ కంపెనీ ‘హార్లీ డేవిడ్సన్’ తాజాగా రెండు కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ‘రోడ్‌స్టర్,’ ‘రోడ్ గ్లిడ్ స్పెషల్’ అనే ఈ బైక్స్ ధర వరుసగా రూ.9.7 లక్షలుగా, రూ.32.81 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. భారత్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రపంచస్థారుు ఉత్పత్తులను ఆవిష్కరించామని హార్లీ డేవిడ్సన్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ విక్రమ్ పవహ్ తెలిపారు. అలాగే హార్లీ డేవిడ్సన్.. ఏబీఎస్ ఫీచర్‌తో కూడిన స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.4.91 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. అలాగే 2017 ఎడిషన్ మోడళ్లన్నీ కూడా ఇకపై యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)తో రానున్నారుు. రోడ్‌స్టర్: ఇందులో వి-ట్విన్ 1,200 సీసీ ఎరుుర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ టార్క్ 96ఎన్ఎం-4,000ఆర్‌పీఎంగా ఉంది. స్పీడ్, ఆర్పీఎం, టైమ్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్లను చూపించడానికి 4 అంగుళాల డిజిటల్ ఉపకరణాన్ని చేర్చారు. రోడ్ గ్లిడ్ స్పెషల్: ఈ బైక్‌లో మిల్వాకీ-8 107 సింగిల్ కమ్ వి-ట్విన్ 1,745 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇందులోనూ 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంది. -
విచిత్రవిహారం
కస్టమైజ్డ్గా తీర్చిదిద్దిన మోటార్ సైకిల్స్‌లో బెస్ట్ కస్టమైజ్డ్ని ఎంపిక చేసేందుకు హార్లీ డేవిడ్సన్ కంపెనీ ప్రతీ ఏటా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించే రాక్ రైడర్స్ కాంటెస్ట్‌కు సౌత్ ఇండియా నుంచి కొచ్చిన్ తర్వాత ఎంపికైన బైక్ మన సిటీదే కావడం విశేషం. దీంతో ఈ బైక్‌ని డిజైన్ చేసిన ఇద్దరు యువకులు అకస్మాత్తుగా లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ముంబయిలో అక్టోబరు 30 నుంచి 2రోజులు కొనసాగే ఈ పోటీకి ఎంపికైన లేటెస్ట్ హార్లీ డేవిడ్సన్ బైక్‌ను కస్టమైజ్ చేసిన వీరిద్దరూ.. మోటార్ సైకిల్స్, హెల్మెట్స్ తమకు కాన్వాస్ అంటున్నారు. లుక్ కాదు వర్క్ బాగుండాలి... వీరు ఇంజినీర్లు మాత్రమే కాదు రైడర్స్ కూడా. అందుకే బైక్ లుక్ అదిరిపోవడం అంటే... దాని పనితీరు మందగించడం కాదంటారీ ఫ్రెండ్స్. హార్లీ బైక్స్‌లో అవార్డులు గెలుచుకున్న దాదాపు డజను బైక్స్‌కు వీరు పెయింట్ చేశారు. ‘ఒక బైక్ ఓనర్ హైదరాబాద్ మీద తన ఇష్టాన్ని బైక్ ద్వారా ప్రదర్శించాలనుకున్నాడు. మేం దాన్ని పుల్‌ఫిల్ చేశాం. బైకర్స్ తమ అభిరుచుల్ని, ఇష్టాఇష్టాల్ని బైక్స్ ద్వారా ప్రదర్శించుకునేందుకు సహకరించడమే మా ధ్యేయం. ఇప్పటికి దాదాపు 120 బైక్స్‌కి ఆర్ట్‌వర్క్ చేశాం. దేశవ్యాప్తంగా పంజాబ్, దిల్లీ, జమ్మూ కశ్మీర్‌ల నుంచి కూడా మాకు కస్టమర్స్ వస్తుంటారు’ అని చెప్పారీ ద్వయం. బాడీ మీద టాటూ వేయించుకోవడం బైక్ మీద పెయింటింగ్ సేమ్ అంటున్న వీరు.. కస్టమైజేషన్‌కు కనీసం 3వారాల సమయం, రూ.50 వేల పైనా వ్యయం అవుతుందంటున్నారు. ఏదేమైనా వైవిధ్యమైన రంగాన్ని ఎంచుకుని రాణిస్తున్న ఈ యువత మన సిటీ తరఫున విన్నర్స్‌గా తిరిగి రావాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్. కాంటెస్ట్‌కు ఎంపికైన బైక్‌కు మేం అమర్చిన హంగులివే... కస్టమైజేషన్‌కు వీలయ్యే బైక్స్‌లో స్ట్రీట్ 750 హార్లీ డేవిడ్సన్ బైక్ ది బెస్ట్. మేం చాలా బైక్స్ మోడిఫై చేశాం. కాని పూర్తిస్థాయిలో మోడిఫికేషన్ చేసిన హార్లీ బైక్ ఇదే. గ్లాస్ ఊల్‌తో చేసిన హ్యాండ్‌మేడ్ మఫ్లర్స్ ద్వారా దీని సౌండ్‌ని ఫ్యాబ్యులస్గా మార్చాం. ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అమర్చాం. విండ్ షీల్డ్ జత చేశాం. డిటచబుల్ లెదర్ బెల్ట్స్‌తో ఎంత లగేజీ అయినా క్యారీ చేసేందుకు వీలు కల్పించాం. క్రేజీగా అనిపించే ఎల్ఈడీ లైటింగ్స్ చేర్చాం. వీటన్నింటితో పాటు మాకే ప్రత్యేకమైన పెయింటింగ్‌ను అద్దాం. ‘ఒకప్పుడు ఐటీ ఉద్యోగులం. ఆఫీస్ నాలుగ్గోడలను మించి లైఫ్ ఎదగాలనే ఆశ. దాంతో పాటే మోటార్ బైక్ ప్రియత్వం కూడా ఉంది. యూకే, యూఎస్‌లలో కన పడే హై ఎండ్ బైక్స్లా మా బైక్స్‌ను కూడా కస్టమైజ్ చేసుకోవాలని ట్రై చేశాం’’ అంటూ గుర్తు చేసుకున్నారు ఈస్ట్ ఇండియా మోటార్ సైకిల్ రెవల్యూషన్(ఐమోర్ కస్టమ్స్) నిర్వాహకులు మృత్యుంజయ్, సైకత్ బసు. వీరిలో మృత్యుంజయ ఒడిశా, సైకత్ కోల్‌కతా నుంచి వచ్చి సిటీలో స్థిరపడ్డారు. పెయింట్‌కు పేటెంట్... వీళ్లిద్దరికీ ఫైనార్ట్స్‌లో చిన్నప్పటి నుంచి ప్రవేశముంది. తమ బైక్స్‌ని కొత్తగా కనిపించేలా చేయాలనే ఆరాటంతో నచ్చిన బొమ్మలు దాని మీద పెయింట్ చేశారు. దీంతో ఎక్కడ వీళ్ల మోటార్ సైకిల్ ఆపినా... జనం కాంప్లిమెంట్స్ ఇవ్వడం, ఫొటోలు తీయడం, తమ బైక్స్పైన కూడా ఆర్ట్ వర్క్ చేయమని అడగడం చేసేవారు. ‘ఆ తర్వాత అదే మమ్మల్ని ఈ ప్రొఫెషన్లోకి తీసుకొచ్చింది. బైక్స్‌తో పాటు హెల్మెట్స్‌పై కూడా పెయింటింగ్ చేయడం ప్రారంభించాం. ఉద్యోగాలు వదిలేసి ఐదేళ్ల క్రితం దీనిని పూర్తిస్థాయి ప్రొఫెషన్‌గా మార్చుకున్నాం. పూర్తి కస్టమైజేషన్‌కు విస్తరించాం’’అంటూ చెప్పారీ యువ చిత్రకారులు. మాదాపూర్‌లోని సర్వే ఆఫ్ ఇండియా కాలనీలో విశాలమైన షెడ్‌ని వీరు తమ ఆర్ట్ వర్క్‌కు అనుగుణంగా తీర్చిదిద్దుకున్నారు. -
ఆరు లక్షల బైక్‌తో తుర్రుమన్నాడు
ట్రయల్ ‘రన్’ హైదరాబాద్: రిచ్ లుక్ తో వచ్చాడు.. ఖరీదైన బైక్ వివరాలడిగాడు.. ట్రయల్ రన్ వేస్తానని చెప్పాడు.. షాపు యజమానులకు షాక్ ఇస్తూ ఆరు లక్షల బైక్‌తో తుర్రుమన్నాడు. హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...హార్లీ డేవిడ్సన్ బైక్‌కు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్విచక్ర వాహనంగా పేరుంది. ఒక రకంగా యువత కలల బైక్ కూడా ఇదేనని చెప్పొచ్చు. ఇలాంటి బైక్‌లు కొనలేని వారు వాటిని షోరూంలో చూసి, వీలుంటే ట్రయల్న్ ్రవేసి, సెల్ఫీలు తీసుకొని తెగ ఆనందపడిపోతుంటారు. కానీ, ఓ ప్రబుద్ధుడు మాత్రం చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండానే ఈ ఖరీదైన బైక్‌ను సొంతం చేసుకునేందుకు పథకం పన్నాడు. బంజారాహిల్స్ సాగర్ సొసైటీ చౌరస్తాలో ఉన్న హార్లీ డేవిడ్సన్ షోరూంకు మంగళవారం ఆధునిక దుస్తుల్లో ఓ యువకుడు వచ్చాడు. అక్కడివారిని కొత్త బైక్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నాడు. తన పేరు సయ్యద్ తాహెర్ అని పరిచయం చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అని నెలకు రూ.లక్షన్నర జీతం ఉంటుందని నమ్మబలికాడు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 23లో నివాసముంటున్నట్లు చెప్పాడు. కొత్తగా వచ్చిన హార్లీడేవిడ్సన్ స్ట్రీట్ 750 మోడల్ బైక్ కావాలంటూ బేరమాడాడు. క్రెడిట్‌కార్డులను కూడా చూపించాడు. ట్రయల్ రన్ వేస్తానని చెప్పాడు. ఇంకేముంది తప్పకుండా కొనుగోలు చేస్తాడని షోరూం నిర్వాహకులు భావించారు. అతడికి బైక్ తాళం చెవి అప్పగించారు. దర్జాగా ట్రయిల్ రన్‌కు వెళ్లండి అంటూ టాటా చెప్పారు. అంతే యమా స్పీడ్‌తో అక్కడ నుంచి దూసుకెళ్లిన తాహీర్ తిరిగిరాలేదు. మూడు గంటలు గడిచినా షోరూం నిర్వాహకులకు పరిస్థితి అర్థం కాలేదు. చివరికి అతడు వచ్చింది కొనడానికి కాదు కొట్టేయడానికి అని ఆలస్యంగా తెలియడంతో వెంటనే అతడు ఇచ్చిన నంబర్‌కు ఫోన్ చేశారు. స్విచ్చాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ సీఐ పి. మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. యువకుడి ఊహాచిత్రాన్ని రూపొందిస్తున్నారు. -
హార్లీ డేవిడ్సన్ నుంచి 3 కొత్త మోడళ్లు
ముంబై: హార్లీ డేవిడ్సన్ కంపెనీ మూడు కొత్త బైక్‌లను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు బైక్‌ల్లో చేతితో తయారైన సీవీఓ లిమిటెడ్ బైక్ కూడా ఉందని హార్లీ డేవిడ్సన్ మేనేజింగ్ డెరైక్టర్ అనూప్ ప్రకాశ్ చెప్పారు. ఈ బైక్ ధర రూ.49.23 లక్షలు (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)అని పేర్కొన్నారు. మరో రెండు బైక్‌లు-బ్రేకవుట్ (ధర రూ.16.28 లక్షలు), స్ట్రీట్ గ్లైడ్ స్పెషల్ (రూ.29.70 లక్షలు)లను కూడా అందిస్తున్నామని చెప్పారు. తాజాగా అందిస్తున్న ఈ మూడు బైక్‌లతో కలుపుకొని తాము భారత్‌లో విక్రయిస్తున్న మొత్తం మోడళ్ల సంఖ్య 13కు పెరిగిందని పేర్కొన్నారు. వీటిల్లో తొమ్మిందింటిని భారత్‌లోనే అసెంబుల్ చేస్తున్నామని, మూడింటిని దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. -
హార్లీ.. జాలీ
రెక్కలు విప్పి ఆకాశంలో విహరించే పక్షిలా... ప్రపంచాన్ని స్వేచ్ఛగా చుట్టి రాగలిగితే ఎలా ఉంటుంది! అంతటి అనుభూతి... ఆనందం... హార్లీ డేవిడ్సన్ బైక్స్‌పై దూసుకుపోతుంటే కలుగుతుంది. గంభీరమైన రూపం... నడిచేటప్పుడు గర్జించే శబ్దం... ఓహ్..! ఆ ఫీలే వేరు! ఈ ఫీల్‌ను ఆసాంతం ఆస్వాదిస్తున్నారు ‘హార్లీ డేవిడ్సన్ హైదరాబాద్ గ్రూప్’ సభ్యులు. మూడు తరాలుగా వీరు ప్రపంచ వ్యాప్తంగా ఈ బైక్‌పై రైడింగ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా స్పోర్ట్స్ బైక్స్ వర్క్‌షాప్ నుంచి డెరైక్ట్‌గా వస్తాయి. వాటిని పెద్దగా మార్చడానికి అవకాశం ఉండదు. ప్రీ సెట్ చేసి ఉంటాయి. అదే హార్లీలో ఓనర్స్ ఎక్స్‌ప్రెషన్‌కి తగ్గట్టుగా ఏదైనా మార్చుకోవచ్చు. వీటి యజమానులను ఆకర్షించే ప్రధాన అంశాల్లో ఇదొకటి. ఇక దేశంలో ఏ మూలకు వెళ్లినా అక్కడ హార్లీ ఓనర్స్ ఉంటారు. కొత్తవారిని ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటారు. హార్లీ ఓనర్ కొత్తగా ఏ ఊరుకి ట్రాన్స్ఫర్ అయినా... అతనికి హార్లీ బ్రదర్స్ సపోర్ట్ దొరుకుతుంది. కొత్త ఊర్లో హార్లీ కుటుంబ సభ్యులతో పరిచయం అన్ని రకాలుగా హెల్ప్ అవుతుంది. గతంలో హార్లీ ఒక బైక్. కానీ ఇప్పుడు ఒక కుటుంబం. దేశ వ్యాప్తంగా నాలుగు జోన్లు, 13 చాప్టర్లున్న ఈ గ్రూప్‌ల మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం కనిపిస్తుంది. అన్ని ప్రాంతాల వారూ కలుసుకొనే అవకాశం ‘హగ్ రైడ్స్’తో కలుగుతుంది. ఇది గ్రూప్ సభ్యుడైన శ్యామల్ జేత్వా అభిప్రాయం. ముప్ఫై ఏళ్లుగా... అన్ని రకాల బైక్స్ రైడ్ చేశా. రైడింగ్‌లో 30 ఏళ్ల అనుభవం. 68 దేశాలు చుట్టివచ్చా. ఒక హార్లీ పర్సన్ 100 మందిలో పాజిటివ్ ఆలోచన కలిగించే దిశగా పనిచేస్తున్నారు. ఆరోగ్యం, ఆహారం, వసతి ఇలా రకరకాల అంశాలలో. దీని కోసం ప్రతి రైడ్‌లో చారిటీ కోసమో, స్పెషల్ కాజ్ కోసమో ప్రయత్నిస్తుంటారు. హైదరాబాద్ హార్లీ గ్రూప్ నాలుగేళ్లుగా ఓ ఆరోగ్యకరమైన వాతావరణంలో, ఓ పెద్ద కమ్యూనిటీగా పనిచేస్తోంది. ఇందులోని ఈతరం పిల్లలూ ఎంతో క్రమశిక్షణతో మెలుగుతారు. గర్ల్స్ కూడా ఇందులో ఎంతో చురుగ్గా, ఆసక్తిగా పాల్గొంటున్నారు. ఇది గ్రూప్‌లో సీనియర్ డాక్టర్ రాజగోపాల్ మాట. 110 ఏళ్లు... 110 ఏళ్ల క్రితం హార్లీ కార్పోరేషన్ చికాగో (అమెరికా)లో ప్రారంభమైంది. హార్లీ డీలర్స్ ప్రపంచ వ్యాప్తంగా 5000, ఓనర్స్ మిలియన్ పైగా ఉన్నారు. ఈ బైక్స్ నాసా రాకెట్ సైన్స్ సాంకేతికతో రూపొందుతాయి. ఇంజన్, గేర్ బాక్స్, మెటీరియల్ అన్నీ ఆ స్థాయిలోనే ఉంటాయి. 18 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకూ హార్లీ బైక్ నడుపుతున్నారు. 16, 17 ఏళ్ల వారైతే హార్లీ స్కూల్స్‌కి వెళ్లి రైడింగ్ నేర్చుకొంటున్నారు. హార్లీ స్కూల్స్‌లో రైడింగ్‌లో గ్రాడ్యుయేషన్ కోర్సులు కూడా ఉన్నాయి. రయ్య్ రైడ్స్... ఇంతకు ముందు ఈ గ్రూప్ లక్ష్యం చిన్నదే. ఇప్పుడు సేవ్ గర్ల్ చైల్డ్ లాంటి దేశవ్యాప్త సమస్యలతో పాటు అనేక సామాజిక అంశాల గురించి రైడ్స్ నిర్వహిస్తున్నారు. కర్నూలు, విజయవాడ, మహబూబ్‌నగర్... ఇలా ప్రతి ఆదివారం ఏదో ఒక రైడ్ ప్లాన్ చేసుకొని వెళ్తుంటారు. వీటివల్ల జీవితంలో ఆశావహ దృక్ఫథం అలవడుతుందనేది సభ్యుల అభిప్రాయం. ఇదే వీరి ఆరోగ్య రహస్యం కూడానట. ఈ గ్రూప్ సభ్యులు బర్మాలో జరుగనున్న ఏషియా బైక్ ఫెస్టివల్‌కు వెళుతున్నారు. దీనిలో హైదరాబాద్‌కు చెందిన 20 మంది రైడర్స్ పాల్గొంటున్నారు. పిల్లలు, ప్రపంచశాంతి కోసం నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. సిక్కిం, నేపాల్ నుంచి సింగపూర్ రోడ్డు మార్గంలో ఇలాంటి రైడ్ నిర్వహించటం ఇదే మొదటిసారి. గతంలో ఈ గ్రూప్ 9 రీజినల్ కార్యక్రమాలు నిర్వహించారు. 15 వేల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. - ఓ మధు -
లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్, హ్యోసంగ్, కవాసాకి నింజా, డ్యుకాటీ... ఈ పేర్లు వినగానే లగ్జరీ బైకులని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఇప్పుడివి మగవారికి మాత్రమే సొంతం కాదండోయ్!!. ‘మేము కూడా దూసుకుపోతాం’ అంటున్నారు మహిళలు. అవును.. లగ్జరీ, సూపర్ బైకుల రైడింగ్‌పై మహిళల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. వీరి ఆసక్తి తగ్గట్టే మహిళల కోసం ప్రత్యేకమైన లగ్జరీ బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి వాహన సంస్థలు. దేశవ్యాప్తంగా ఏటా 10 వేల లగ్జరీ బైకులు అమ్ముడవుతుండగా ఇందులో మహిళ వాటా 10 శాతంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. మెట్రో నగరాల్లో మహిళల జీవన శైలి, ఆలోచన విధానాల్లో అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. దీంతో మగవారితో సమానంగా వారు కూడా లగ్జరీ, సూపర్ బైకులను నడపాలని కోరుకుంటున్నారు. అయితే మనదేశంలో మహిళా బైక్ రైడింగ్ విభాగం చాలా చిన్నది. అందుకే మహిళా కస్టమర్లను ఆకర్షించడం ఇక్కడ సులువైన పని కాదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ‘‘ప్రతి నెలా లగ్జరీ బైక్స్ కొనేందుకు మా షోరూమ్‌కు వచ్చే 15 మంది కస్టమర్లలో ఇద్దరు మహిళా కస్టమర్లు ఉంటున్నారు’’ అని హార్లీ డేవిడ్సన్ ఏపీ డీలర్ జయ్‌రామ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ‘స్ట్రీట్ 750’ ‘సూపర్’లో లగ్జరీ బైకులు మహిళలకు సరిగ్గా సరిపోతాయన్నారు. ‘‘ఎందుకంటే వీటి ఎత్తు, బరువు మిగతా లగ్జరీ బైకులకంటే తక్కువగా ఉంటాయి. దీంతో నాలుగు ఫీట్లుండే మహిళలు ఈ బైకులపై కూర్చున్నా కూడా వారికి బ్రేకులు, గేర్లు అందుతాయి’’ అని వివరించారు. దేశ వ్యాప్తంగా హార్లీ డేవిడ్సన్ బైకులకు 2 వేల మంది మహిళా కస్టమర్లున్నారని ఆయన చెప్పారు. ‘‘లాంగ్ డ్రైవ్ కోసమే లగ్జరీ బైకులు. ఇతర బైకులు గనక 80 కి.మీ. వేగాన్ని దాటితే నియంత్రించలేం. కానీ, లగ్జరీ బైకులు 150 కి.మీ. దాటినా సులువుగా నియంత్రించొచ్చు. అందుకే హ్యోసంగ్ నుంచి 250 సీసీ క్రూజర్ బైకును ప్రత్యేకంగా మహిళల కోసమే మార్కెట్లోకి విడుదల చేశాం’’ అని చెప్పారు హోయోసంగ్ ఏపీ డీలర్ వంశీ కృష్ణ. 170 కిలోల బరువుండే ఈ బైకుపై ఆగకుండా వెయ్యి కి.మీ ప్రయాణించినా నడుం నొప్పి రాదని వంశీ కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే మగవారిని ఆకర్షించినంత సులువుగా మహిళా కస్టమర్లను ఆకర్షించలేమని ఆయనన్నారు. కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, సమాజ కోణం వంటి ఎన్నో కారణాలున్నాయన్నారు. 250 సీసీ నుంచి 1,800 సీసీ గల లగ్జరీ, సూపర్ బైకులు దేశవ్యాప్తంగా ఏటా 10 వేలు అమ్ముడవుతుండగా... వీటిలో మహిళల వాటా 10 శాతం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లలో లగ్జరీ బైకుల కొనుగోళ్లలో మహిళల వాటా 20-30% పెరిగే అవకాశముందన్నది వారి అంచనా. ఎత్తు, బరువు తక్కువుంటేనే..: సాధారణంగా మహిళలు నడిపే స్కూటీ పెప్ వాహనాల పొడవు 1,735 ఎంఎం, వెడల్పు 590 ఎంఎం, సీటు ఎత్తు 740 ఎంఎం ఉంటుంది. కానీ లగ్జరీ, సూపర్ బైక్స్ భిన్నమైనవి. మహిళలు వీటి ని నియంత్రించడం కొంచెం కష్టం. అందుకే మహిళల కోసం లగ్జరీ బైకుల తయారీలో బండి బరువు, ఎత్తు తగ్గింపు వంటి చిన్న మా ర్పులు చేస్తున్నారు. దీంతో మగాళ్లతో సమానంగా మహిళలూ లగ్జరీ, సూపర్ బైక్స్‌పై దూసుకుపోతున్నారు. సర్వేలు శిక్షణ కూడా... కోట్లు వెచ్చించి తయారు చేసిన వాహనాలు తీరా మార్కెట్లోకి విడుదలయ్యాక మహిళలు స్వాగతించకపోతే కంపెనీలకు నష్టమే. అందుకే మహిళలు ఎలాంటి బైకులు ఇష్టపడతారో సర్వేలు చేసి మరీ విడుదల చేస్తున్నాయి. హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ముందు మహిళలు, మగవారు ఇద్దరిలో ఈ బైక్ ఎవరికి కరెక్ట్‌గా సరిపోతుందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేశాకే ప్రవేశపెట్టింది. బరువెక్కువగా ఉండే లగ్జరీ, సూపర్ బైకులను ఎలా నియంత్రించాలో మహిళల కోసం ప్రత్యేకమైన శిక్షణ తరగతులూ నిర్వహిస్తున్నాయి ట్రయంఫ్ వంటి కొన్నికంపెనీలు. -
రైడ్‌కు రెడీ...మారుతీ సెలెరియో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర మార్కెట్లోకి సెలెరియో కారును శుక్రవారం మారుతి సుజుకి విడుదల చేసింది. వేగాన్నిబట్టి కారు సొంతంగా గేర్లు మార్చుకునేలా ఆటో గేర్ షిఫ్ట్‌ను ఇందులో పొందుపరిచారు. ప్యాసింజర్ కార్లలో దేశంలో తొలిసారిగా ఆటో గేర్ షిఫ్ట్‌ను సెలెరియోలో అమర్చారు. భారత్‌లో కొత్త విభాగాన్ని ఇది సృష్టిస్తుందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ సి.వి.రామన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ మేనేజర్ ఓంకార్ నాథ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ వాహనాల ఖరీదు ఎక్కువగా ఉంటుందని, మైలేజీ రాదన్న అపవాదు ఉండడం వల్లే వీటి వ్యాప్తి అతి తక్కువగా ఉందని చెప్పారు. సెలెరియో మాన్యువల్ ట్రాన్స్మిషన్ బేసిక్ వేరియంట్‌తో పోలిస్తే ఆటో గేర్ షిఫ్ట్ బేసిక్ వేరియంట్ రూ.41 వేలు మాత్రమే ఖరీదు ఎక్కువ. ఇక మైలేజీ రెండు వేరియంట్లూ లీటరు పెట్రోలుకు 23.1 కిలోమీటర్లని వివరించారు. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో నాలుగు, ఆటో గేర్‌లో రెండు వేరియంట్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. హైదరాబాద్ ఎక్స్ షోరూంలో కారు ధర మాన్యువల్ ట్రాన్స్మిషన్ రూ.4.02 లక్షల నుంచి రూ.5.10 లక్షల వరకు ఉంది. ఆటో గేర్ షిఫ్ట్ ధర రూ.4.43-4.73 లక్షలు. త్వరలో కొత్త భద్రతా ప్రమాణాలు... దేశంలో ప్రయాణికుల వాహనాలు ఇక మరింత భద్రంగా రూపొందనున్నాయని రామన్ చెప్పారు. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మూడు నెలల్లో కనీస భద్రతా ప్రమాణాలను ప్రకటించనుందని పేర్కొన్నారు. 800.. ఇక ఓ జ్ఞాపకం దాదాపు మూడు దశాబ్దాల పాటు భారత మధ్య తరగతి ప్రజలను మురిపించిన మారుతీ 800 కారు ఇక మధుర జ్జాపకంగా మిగిలిపోనుంది. మధ్య తరగతి ప్రజల కలల కారుగా ప్రఖ్యాతి గాంచిన ‘800’ ఉత్పత్తిని మారుతీ ఆపేసింది. గత నెల 18 నుంచి ఈ కార్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేశామని కంపెనీ ఈడీ రామన్ శుక్రవారం చెప్పారు. కార్ల ఉత్పత్తిని ఆపేసినా, నిబంధనల ప్రకారం ఈ కార్ల విడిభాగాలు మరో 8-10 ఏళ్ల పాటు అందుబాటులో ఉంచుతామని వివరించారు. సెలెరియో హ్యాచ్‌బాక్‌ను ఇక్కడి మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. మార్కెట్ నుంచి ఉపసంహరించిన కారు మోడళ్ల విడిభాగాలను గతంలో 8-10 ఏళ్లపాటు అందుబాటులో ఉంచామని, ఎం800 కారు విషయంలో కూడా దీనినే అనుసరిస్తామని చెప్పారు. హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్సహా మొత్తం 13 నగరాల్లో 2010, ఏప్రిల్ నుంచే ఈ కార్ల విక్రయాలను కంపెనీ ఆపేసింది. -
110 ఏళ్ల హార్లీ డేవిడ్సన్ బైక్
-
హార్లే డేవిడ్సన్ బైక్‌ల తయారీ ఇక భారత్‌లోనూ...
న్యూఢిల్లీ: హార్లే డేవిడ్సన్ కంపెనీ పూర్తిస్థాయిలో బైక్‌లను భారత్‌లోనే తయారు చేయనున్నది. యూరప్, నైరుతి ఆసియా దేశాలకు భారత్ నుంచే తమ బైక్‌లను ఎగుమతి చేయాలని కూడా కంపెనీ యోచిస్తోంది. తాజాగా హర్లే డేవిడ్సన్ స్ట్రీట్ 750, స్ట్రీట్ 500 మోడల్ బైక్‌లను ఇటలీలోని మిలన్లో ఆవిష్కరించింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత అంతా కొత్త ప్లాట్‌ఫామ్‌పై ఈ కంపెనీ ఈ బైక్‌లను తయారు చేసింది. ఈ 2 బైక్‌లను వచ్చే ఏడాది మార్చికల్లా భారత్‌లోనే తయారుచేయడం ప్రారంభిస్తామని కంపెనీ పేర్కొంది. భారత్‌లోనూ, సమీప దేశాల్లోనూ తమ బైక్‌లకు మంచి ఆదరణ లభిస్తోందని హార్లే డేవిడ్సన్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్, సీవోవో మాథ్యూ లావటిక్ చెప్పారు. అందుకే భారత మార్కెట్ అవసరాలను తీర్చడమే కాకుండా, సమీప దేశాలకు ఎగుమతులు చేయడం లక్ష్యంగా స్ట్రీట్ బైక్‌లను భారత్‌లో ఉత్పత్తి చేయనున్నామని వివరించారు. ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ కంపెనీ ఐదు మోడళ్లు-స్పోర్ట్స్టెర్, డైనా, సాఫ్టెయిల్, వి-రాడ్, టౌరింగ్లలో మొత్తం 11 మోడళ్లను అందిస్తోంది. ఆకర్షణీయంగా ధరలు... ప్రస్తుతం భారత్‌లో కంపెనీ విక్రయిస్తున్న అతి చౌక హార్లే డేవిడ్సన్ బైక్.. ‘సూపర్ లో’ ధర రూ.5.6 లక్షలుగా(ఎక్స్ షోరూమ్-ఢిల్లీ) ఉంది. ఈ బైక్ కంటే తక్కువగానే ‘స్ట్రీట్’ మోడల్ బైక్‌ల ధరలు ఉంటాయని సమాచారం. స్ట్రీట్ 500 ధరలు రూ.3.8 లక్షలు-4 లక్షల వరకూ, స్ట్రీట్ 700 ధరలు రూ.4.5 లక్షలు-4.8 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా. భారత్‌లోనే తయారు చేస్తున్నందున ఆకర్షణీయమైన ధరలకే వీటిని అందిస్తామని, ఈ ధరల కారణంగా మంచి అమ్మకాలు సాధిస్తామని కంపెనీ ఆశిస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. హర్యానాలోని బవాల్ ప్లాంట్‌లో ఈ బైక్‌లు తయారవుతాయి. -
హార్లే డేవిడ్సన్ ‘స్ట్రీట్ గ్లైడ్’ 2014 ఎడిషన్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ కంపెనీ స్ట్రీట్ గ్లైడ్ మోడల్లో 2014 ఎడిషన్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధరను రూ.29 లక్షలుగా నిర్ణయించామని హర్లే డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాష్ చెప్పారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హర్లే డేవిడ్సన్ బైక్‌లను అప్‌గ్రేడ్ చేసే ప్రాజెక్ట్ రష్మోర్లో భాగంగా ఈ బైక్‌ను తెచ్చామని వివరించారు. 1690 సీసీ, వి-ట్విన్ ఎయిర్-కూల్డ్, ట్విన్ కాంషాఫ్ట్ ఇంజిన్, డ్యుయల్ హాలోజెన్ బల్బ్ ఉన్న కొత్త హెడ్‌లైట్, 5 స్పోక్ అలాయ్ వీల్స్, 6 గేర్లు, ఏబీఎస్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఎల్సీడీ స్క్రీన్, రెండు స్పీకర్స్, బ్లూ టూత్ కనెక్టివిటీ, రేడియో, వాయిస్ రికగ్నిషన్, ఎంపీత్రీ డివైస్‌లను సపోర్ట్ చేసే యూఎస్బీ ఎడాప్టర్ ఉన్న ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను డాష్‌బోర్డ్‌లో అమర్చారు.