డుకాటి కొనుగోలు రేసులోకి మరో దిగ్గజం
డుకాటి కొనుగోలు రేసులోకి మరో దిగ్గజం
Published Fri, Jun 23 2017 12:51 PM | Last Updated on Tue, Sep 5 2017 2:18 PM
ఇటాలియన్ మోటార్ సైకిల్ ప్రత్యర్థి డుకాటిని సొంతం చేసుకోవడం కోసం అమెరికా మోటార్ సైకిల్ దిగ్గజం హార్లే-డేవిడ్ సన్ కొనుగోలు రేసులోకి వచ్చింది. మోటార్ సైకిలింగ్ అత్యంత ఫేమస్ అయిన ఈ రెండు సంస్థలు ఓ డీల్ కుద్చుబోతున్నాయని తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం మేరకు ఈ డీల్ 1.5 బిలియన్ యూరోల(రూ.10,812కోట్లకు పైగా) వరకు ఉండొచ్చని సమాచారం. డుకాటిని జర్మన్ కారు తయారీదారు ఫోక్స్ వాగన్ విక్రయానికి పెట్టింది. ఈ విక్రయానికి దేశీయ మోటార్ సైకిల్ తయారీదారి బజాజ్ ఆటోతో పాటు పలు కంపెనీలు బిడ్స్ దాఖలు చేశాయి. హీరో మోటార్ కార్పొ, తన ప్రత్యర్థి టీవీఎస్ మోటార్ కూడా డుకాటి కొనుగోలు చేయాలనుకుని, తర్వాత విరమించుకున్నాయి.
అయితే ఫోక్స్ వాగన్ లో అత్యంత పాపులర్ లేబర్ యూనియన్లు ఈ విక్రయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కూడా దీన్ని కొనుగోలుచేయాలని ఆసక్తి కనబరిచింది. ప్రస్తుతం హార్లే-డేవిడ్ సన్ కూడా ఈ కొనుగోలురేసులోకి వచ్చేసింది. డీజల్ ఉద్గార కుంభకోణం వోక్స్‌వ్యాగన్ గ్రూపు మీద తీవ్ర ప్రభావం చూపింది. దీని నుండి ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకునేందుకు వోక్స్‌వ్యాగన్ తమ డుకాటి టూ వీలర్ల తయారీ సంస్థను విక్రయించేందుకు సిద్దమైంది. ఖరీదైన మరియు శక్తివంతమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటి మొత్తం విలువ రూ. 10,500 కోట్ల రుపాయలుగా ఉంది.
1926లో లాంచ్ అయిన ఈ డుకాటిని, ఆడి కు చెందిన వోక్స్‌వ్యాగన్ గ్రూపు 2012 లో 6,000 కోట్ల రుపాయలకు కొనుగోలు చేసింది. ఆ తరువాత కాలంలో 800సీసీ నుండి 1,200సీసీ సామర్థ్యం రేంజ్ ఉన్న మోటార్ సైకిళ్లను అభివృద్ది చేసింది. ప్రస్తుతం హార్లే డేవిడ్ సన్ కు అమెరికాలో సగానికి పైగా మార్కెట్ కలిగి ఉంది.
Advertisement