హార్లీ డేవిడ్ సన్ నుంచి 2 కొత్త బైకులు | Harley-Davidson Lineup Including Roadster and Road Glide Special Launched In India | Sakshi
Sakshi News home page

హార్లీ డేవిడ్ సన్ నుంచి 2 కొత్త బైకులు

Published Wed, Nov 9 2016 1:57 AM | Last Updated on Thu, Aug 30 2018 5:57 PM

హార్లీ డేవిడ్ సన్ నుంచి 2 కొత్త బైకులు - Sakshi

హార్లీ డేవిడ్ సన్ నుంచి 2 కొత్త బైకులు

ధర శ్రేణి రూ.9.7 లక్షలు-32.81 లక్షలు

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రీమియం బైక్స్ తయారీ కంపెనీ ‘హార్లీ డేవిడ్‌సన్’ తాజాగా రెండు కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ‘రోడ్‌స్టర్,’ ‘రోడ్ గ్లిడ్ స్పెషల్’ అనే ఈ బైక్స్ ధర వరుసగా రూ.9.7 లక్షలుగా, రూ.32.81 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. భారత్‌లో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రపంచస్థారుు ఉత్పత్తులను ఆవిష్కరించామని హార్లీ డేవిడ్‌సన్ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ విక్రమ్ పవహ్ తెలిపారు. అలాగే హార్లీ డేవిడ్‌సన్.. ఏబీఎస్ ఫీచర్‌తో కూడిన స్ట్రీట్ 750 మోటార్‌సైకిల్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. దీని ధర రూ.4.91 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ) ఉంది. అలాగే 2017 ఎడిషన్ మోడళ్లన్నీ కూడా ఇకపై యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్)తో రానున్నారుు.

 రోడ్‌స్టర్: ఇందులో వి-ట్విన్ 1,200 సీసీ ఎరుుర్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్ టార్క్ 96ఎన్‌ఎం-4,000ఆర్‌పీఎంగా ఉంది. స్పీడ్, ఆర్‌పీఎం, టైమ్, ట్రిప్ మీటర్, గేర్ ఇండికేటర్‌లను చూపించడానికి 4 అంగుళాల డిజిటల్ ఉపకరణాన్ని చేర్చారు.

 రోడ్ గ్లిడ్ స్పెషల్: ఈ బైక్‌లో మిల్వాకీ-8 107 సింగిల్ కమ్ వి-ట్విన్ 1,745 సీసీ ఇంజిన్‌ను అమర్చారు. ఇందులోనూ 6.5 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement