హార్లే డేవిడ్సన్ ‘స్ట్రీట్ గ్లైడ్’ 2014 ఎడిషన్ | Harley-Davidson launches 2014 Street Glide in India | Sakshi
Sakshi News home page

హార్లే డేవిడ్సన్ ‘స్ట్రీట్ గ్లైడ్’ 2014 ఎడిషన్

Published Fri, Oct 11 2013 12:05 AM | Last Updated on Fri, Sep 1 2017 11:31 PM

హార్లే డేవిడ్సన్ ‘స్ట్రీట్ గ్లైడ్’ 2014 ఎడిషన్

హార్లే డేవిడ్సన్ ‘స్ట్రీట్ గ్లైడ్’ 2014 ఎడిషన్

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన హార్లే డేవిడ్సన్ కంపెనీ స్ట్రీట్ గ్లైడ్ మోడల్‌లో 2014 ఎడిషన్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ బైక్ ధరను రూ.29 లక్షలుగా నిర్ణయించామని హర్లే డేవిడ్సన్ ఇండియా ఎండీ అనూప్ ప్రకాష్ చెప్పారు. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా హర్లే డేవిడ్సన్ బైక్‌లను అప్‌గ్రేడ్ చేసే ప్రాజెక్ట్ రష్‌మోర్‌లో భాగంగా ఈ బైక్‌ను తెచ్చామని వివరించారు.  1690 సీసీ, వి-ట్విన్ ఎయిర్-కూల్డ్, ట్విన్ కాంషాఫ్ట్ ఇంజిన్,  డ్యుయల్ హాలోజెన్ బల్బ్ ఉన్న కొత్త హెడ్‌లైట్,  5 స్పోక్ అలాయ్ వీల్స్, 6 గేర్లు,   ఏబీఎస్ వంటి ప్రత్యేకతలున్నాయి. ఎల్‌సీడీ స్క్రీన్,  రెండు స్పీకర్స్, బ్లూ టూత్ కనెక్టివిటీ, రేడియో, వాయిస్ రికగ్నిషన్, ఎంపీత్రీ డివైస్‌లను సపోర్ట్ చేసే యూఎస్‌బీ ఎడాప్టర్  ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను  డాష్‌బోర్డ్‌లో అమర్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement