Ranjeet Ranjan
-
'యానిమల్' సినిమా చూసి నా కూతురు ఏడ్చేసింది.. కాంగ్రెస్ ఎంపీ ఫైర్
రణ్‌బీర్ కపూర్ - రష్మిక కాంబినేషన్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రం 'యానిమల్'. పాన్ ఇండియా రేంజ్లో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ఈ చిత్రం రన్ అవుతుంది. ఈ సినిమాలో సందీప్ మేకింగ్ స్టైల్, నటీనటుల ప్రదర్శనను ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. రేణు దేశాయ్, అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ వంటి వారందరూ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు. ఇదిలా ఉంటే మరోవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ కూడా నడుస్తుంది. సమాజానికి ఈ సినిమా ఏ మేసేజ్‌ను ఇస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్న సమయంలో తాజాగా ఛత్తీస్ ఘడ్కు చెందిన ఓ మహిళా ఎంపీ యానిమల్ చిత్రంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ రంజీత్ రంజన్ ఈ టాపిక్‌పై ఏకంగా రాజ్యసభలోనే మాట్లాడారు. సమాజానికి పట్టిన జబ్బుగా యానిమల్ సినిమాను ఆమె అభివర్ణించారు. యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందంటూ ఆమె చెప్పుకొచ్చారు. యానిమల్ సినిమాలో మహిళల పట్ల హింస దారుణంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 'సినిమా అనేది సమాజంలో చాలా ప్రభావం చూపించగలదు. మనం సినిమాను చూస్తూనే పెరిగాం. కాబట్టి సినిమా అనేది యువతను ప్రేరేపిస్తుంది. వారిపై సినిమా ప్రభావం కూడా పడుతుంది. నా కూతురు తన స్నేహితులతో కలిసి యానిమల్ చిత్రానికి వెళ్లింది. కానీ సినిమా మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది.' అని రాజ్యసభలో ఎంపీ రంజీత్ రంజన్ చెప్పారు. యానిమల్ సినిమాలో సిక్కుల యుద్ధ గీతం అయిన అర్జన్ వైలీని దారుణమైన ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. మొఘల్స్, బ్రిటీష్‌తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను ప్రపంచానికి తెలిపిన ఈ పాటను ఇలా వాడుకోవడం ఏ మాత్రం సహించలేని విషయం అని ఆమె తెలిపారు. -
ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు...!
సాక్షి, న్యూఢిల్లీ : శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాల తొలిరోజన కొందరు సభ్యులు.. అనూహ్య రీతిలో సభకు వచ్చారు. సైకిల్, ట్రాక్టర్, బుల్లెట్‌పై ఇలా.. ఒక్కో వాహనం మీద లోక్‌సభకు వచ్చారు. రోడ్లపై వీరిని చూసిన జనాలు.. వీరిని ఒకింత ఆశ్చర్యంగా గమనించడం విశేషం. ఇండియన్ లోక్‌దళ్ పార్టీకి చెందిన ఎంపీ దుష్యంత్ చౌతాలా... ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వచ్చారు. ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వస్తున్న చౌతాలాను ఇతర సభ్యులు, ప్రజలు ఒకింత ఆశ్చర్యంతో గమనించారు. చౌతాలా ఇలా పార్లమెంట్‌కు రావడం కొత్తేమీ కాదు. గతంలో పొల్యూషన్ కారణంగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న సరి-బేసి విధానాన్ని వ్యతిరేకిస్తూ గుర్రంపై పార్లమెంట్‌కు వచ్చారు. కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, బీజేపీ ఎంపీలు మన్షుఖ్ ఎల్ మాండవీయ, మనోజ్ తివారీలు సైకిల్‌పై పార్లమెంట్‌కు హాజరయ్యారు. కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎంపీ రంజీత్ రంజన్ ఆరెంజ్ కలర్లోని హార్లీ డేవిడ్సన్ బైక్‌పై పార్లమెంట్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. మహిళల దినోత్సం కాబట్టి.. మహిళా శక్తిని చాటేందుకు హార్లీడేవిడ్సన్ బైక్ వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు. బీహార్‌లోని సుపాల్ నియోజకవర్గానికి 42 ఏళ్ల రంజిత్ రంజన్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ప్రారంభమైన శీతాకాల సమావేశాలు.. జనవరి 5 వరకూ కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా ట్రిపుల్ తలాక్ సహా 14 కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. -
హార్లీ డేవిడ్సన్ బైకుపై వచ్చిన మహిళా ఎంపీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈరోజు పార్లమెంటు మహిళా ఎంపీలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో ఉమెన్స్ డే పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ పార్లమెంట్ ఆవరణలో హల్చల్ చేశారు. ఖరీదైన బైకుపై ఆమె లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. హెల్మెట్ పెట్టుకుని.. హార్లీ డేవిడ్సన్ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ పార్లమెంటుకు చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సభలో మహిళలే మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించడంతో.. ఉదయం నుంచి లోక్‌సభలో మహిళలే మాట్లాడుతున్నారు. కాగా వివాదాస్పద బిహారీనేత పప్పూ యాదవ్ భార్య రంజీత్, బిహార్ లోని సౌపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో భర్త ఆర్జేడీ నేతగా క్రియాశీల రాజకీయాల్లో ఉంటే, ఆమె మాత్రం కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాంగ్రెస్‌కు బలంగా వీస్తున్న వ్యతిరేక పవనాల్లో ఆమె విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. -
లోక్‌సభకు ఎన్నికైన ఏకైక జంట
పాట్నా: బీహార్‌కు చెందిన పప్పు యాదవ్ దంపతులు లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. 16వ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన వీరు పార్లమెంట్ దిగువసభలో కొలువుదీరనున్నారు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఏకైక జంట వీరే కావడం విశేషం. పప్పు యాదవ్ గా ప్రసిద్ధుడైన రాజేష్ రంజన్ ఐదోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. మాధేపురా నియోజకవర్గం నుంచి ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జేడీ(యూ) జాతీయ అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను 56 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. సపాల్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన పప్పు యాదవ్ భార్య రంజీత్ రంజన్... జెడీ(యూ) అభ్యర్థి దిలేశ్వర్ కామైత్పై దాదాపు 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. భార్యాభర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి లోక్‌సభకు ఎన్నిక కావడం విశేషం. అయితే తమ సిద్ధాంతాలు, దారులు వేరైనా తమ లక్ష్యం ఒకటేనని పప్పు యాదవ్ దంపతులు నవ్వుతూ చెప్పారు.