హార్లీ డేవిడ్‌సన్ బైకుపై వచ్చిన మహిళా ఎంపీ | Congress MP Ranjeet Ranjan rides a bike to the Parliament | Sakshi
Sakshi News home page

హార్లీ డేవిడ్‌సన్ బైకుపై వచ్చిన మహిళా ఎంపీ

Published Tue, Mar 8 2016 12:00 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

హార్లీ డేవిడ్‌సన్ బైకుపై వచ్చిన మహిళా ఎంపీ - Sakshi

హార్లీ డేవిడ్‌సన్ బైకుపై వచ్చిన మహిళా ఎంపీ

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ఈరోజు  పార్లమెంటు మహిళా ఎంపీలతో కళకళలాడుతోంది. ఈ నేపథ్యంలో  ఉమెన్స్ డే పురస్కరించుకొని కాంగ్రెస్ ఎంపీ రంజీత్ రంజన్ పార్లమెంట్ ఆవరణలో హల్చల్ చేశారు. ఖరీదైన బైకుపై ఆమె లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యారు. హెల్మెట్ పెట్టుకుని.. హార్లీ డేవిడ్‌సన్ వాహనాన్ని డ్రైవ్ చేస్తూ పార్లమెంటుకు చేరుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సభలో మహిళలే మాట్లాడాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించడంతో.. ఉదయం నుంచి లోక్‌సభలో మహిళలే మాట్లాడుతున్నారు.

కాగా వివాదాస్పద బిహారీనేత పప్పూ యాదవ్ భార్య రంజీత్,  బిహార్ లోని సౌపాల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీగా  గెలుపొందారు. 2014 ఎన్నికల్లో భర్త ఆర్జేడీ నేతగా  క్రియాశీల రాజకీయాల్లో ఉంటే,  ఆమె మాత్రం కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి ప్రత్యేక ఆకర్షణ నిలిచారు. కాంగ్రెస్‌కు బలంగా  వీస్తున్న వ్యతిరేక పవనాల్లో ఆమె విజయాన్ని  సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement