దావణగెరె:బెళగావి సువర్ణ సౌధలో చేపట్టిన శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే మొైబె ల్‌లో అశ్లీల చిత్రాలను వీక్షించడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం స్థానిక మహానగర పాలికె ఎదుట ధర్నా చేపట్టారు. మహానగర పాలికె సామాజిక, ఆరోగ్య స్థాయీ సమితి అధ్యక్షుడు దినేశ్ శెట్టి మాట్లాడుతూ అసెంబ్లీ స మావేశాల్లో రైతు సమస్యలపై చర్చించకుండా వృథాగా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్‌తో పాటు ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్‌లో అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్నారని వెల్లడించారు.
బాలికల రక్షణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ వా రు సభలో మాత్రం అశ్లీల చిత్రాలు చూడడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మే యర్ రేణుకాబాయి, ఉప మేయర్ అబ్దుల్ లతీఫ్, పాలికె సభ్యులు శివనహళ్లి రమేశ్, హాలేశ్, తిప్పణ్ణ, ఆయూబ్ పైల్వాన్, వెంకటేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీలో అశ్లీల చిత్రాల వీక్షణపై కాంగ్రెస్ ధర్నా
Published Fri, Dec 12 2014 2:34 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement