MLA Prabhu Chauhan
-
ప్రభు చౌహాన్ ఒకరోజు సస్పెన్షన్
సెల్’ కథ ఇలా సుఖాంతం భవిష్యత్తులో తప్పు పునరావృతం చేయకూడదని అంబి, మల్లికార్జునకు హెచ్చరిక సభా కార్యక్రమాల్లో మొబైల్ ఉపయోగం ఇక నిషేధం ఆదేశాలు జారీ చేసిన స్పీకర్ బెంగళూరు: అసెంబ్లీ సమావేశాల్లో సెల్‌ఫోన్‌ను వినియోగించిన ముగ్గురు ప్రజాప్రతినిధుల్లో ఒకరిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరికి స్పీకర్ కఠిన హెచ్చరికలు శుక్రవారం జారీ చేశారు. అంతేకాకుండా ఇకపై సభా కార్యక్రమాలు జరుగుతుండగా సెల్‌ఫోన్‌ను వాడటాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వివరాలు... శాసనసభలో చెరుకు మద్దతు ధర పై చర్చ జరుగుతున్న సమయంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ (ఔరాద్ నియోజకవర్గం) తన సెల్‌ఫోన్‌లోని ప్రియాంక గాంధీ ఫొటోను అసభ్యంగా తాకుతూ (టచ్ చేస్తూ) మీడియాకు గత బుధవారం దొరికి పోయిన విషయం తెలిసిందే. అదే రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి అంబరీష్, ఎమ్మెల్యే మల్లికార్జున శాసనసభలో సెల్ ఫోన్‌తో కాలక్షేపం చేయడం ఒక రోజు ఆలస్యంగా (గురువారం) వెలుగులోకి వచ్చింది. దీంతో అధికర విపక్షపార్టీలు ‘మీ వాళ్లను సస్పెండ్ చేయాలంటే.. కాదు మీ వాళ్లను సస్పెండ్ చేయాలి’ అంటూ ఉభయ సభల్లో రాద్ధాంతం ృష్టించి కార్యకలాపాలకు అడ్డుతగిలారు. దీంతో రెండు రోజుల సమయం వృథా అయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం శాసనసభలో కార్యకలాపాలు మొదలైన వెంటనే విపక్షనాయకుడు జగదీష్ శెట్టర్ మాట్లాడుతూ... ఇంకా సభా సమయాన్ని వృథా చేయడం తమకు ఇష్టం లేదన్నారు. అందువల్ల శాసనసభలో సెల్‌ఫోన్ వాడిన సభ్యులపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దీంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప కలుగజేసుకుని ‘శాసనసభలో అసభ్య రీతిలో ఓ మహిళ ఫొటోను జూమ్ చేసి చూసినందుకు ఎమ్మెల్యే ప్రభు చౌహాన్‌ను ఒక రోజుపాటు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. అదేవిధంగా శాసనసభలో మొబైల్ చూసిన మంత్రి అంబరీష్, శాసనసభ్యుడు మల్లికార్జునలు భవిష్యత్‌లో ఇలాంటి తప్పు మరోసారి చేస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా సభాకార్యక్రమాలు జరుగుతున్న సమయంలో మొబైల్‌ను వినియోగించడం నిషేదిస్తున్నా...’ అని పేర్కొన్నారు. స్పీకర్ కాగోడు తిమ్మప్ప సూచన మేరకు ప్రభు చౌహన్ సభ నుంచి వెళ్లిపోయారు. -
అసెంబ్లీలో అశ్లీల చిత్రాల వీక్షణపై కాంగ్రెస్ ధర్నా
దావణగెరె:బెళగావి సువర్ణ సౌధలో చేపట్టిన శీతాకాల సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే మొైబె ల్లో అశ్లీల చిత్రాలను వీక్షించడాన్ని నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం స్థానిక మహానగర పాలికె ఎదుట ధర్నా చేపట్టారు. మహానగర పాలికె సామాజిక, ఆరోగ్య స్థాయీ సమితి అధ్యక్షుడు దినేశ్ శెట్టి మాట్లాడుతూ అసెంబ్లీ స మావేశాల్లో రైతు సమస్యలపై చర్చించకుండా వృథాగా కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రభుచౌహాన్తో పాటు ఇతర బీజేపీ ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలను వీక్షిస్తున్నారని వెల్లడించారు. బాలికల రక్షణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న బీజేపీ వా రు సభలో మాత్రం అశ్లీల చిత్రాలు చూడడం ఏమిటని మండిపడ్డారు. ఇలాంటి ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీ సుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మే యర్ రేణుకాబాయి, ఉప మేయర్ అబ్దుల్ లతీఫ్, పాలికె సభ్యులు శివనహళ్లి రమేశ్, హాలేశ్, తిప్పణ్ణ, ఆయూబ్ పైల్వాన్, వెంకటేశ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభు చౌహాన్‌పై అనర్హత వేటు వేయండి
బెంగళూరు : ఎమ్మెల్యే ప్రభు చౌహాన్‌పై అనర్హత వేటు వేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ స్పీకర్‌ను కోరారు. గురువారం బెళగావిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలోనే సెల్ఫోన్లో నీలిచిత్రాలు చూసిన చరిత్ర బీజేపీదని ధ్వజమెత్తారు. ఉత్తర కర్ణాటక ప్రజలతో పాటు రైతుల సమస్యలపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో సెల్‌ఫోన్ చూస్తూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ప్రభు చౌహాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఇప్పటికే తమ పార్టీ శాసనసభ్యులకు సైతం శాసనసభలోకి ప్రవేశించే ముందే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా సూచించినట్లు వెల్లడించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మల్సీ వీఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ...అమ్మాయిల ఫొటోలను అసభ్య రీతిలో చూస్తూ బీజేపీ నేతలు మరోసారి తమ గుణాన్ని చాటుకున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాల సమయంలో సెల్‌ఫోన్‌ను వాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.