ప్రభు చౌహాన్‌పై అనర్హత వేటు వేయండి | Prabhu announced that erase the disqualification | Sakshi
Sakshi News home page

ప్రభు చౌహాన్‌పై అనర్హత వేటు వేయండి

Published Fri, Dec 12 2014 2:31 AM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

Prabhu announced that erase the disqualification

బెంగళూరు :  ఎమ్మెల్యే ప్రభు చౌహాన్‌పై అనర్హత వేటు వేయాలని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ స్పీకర్‌ను కోరారు. గురువారం బెళగావిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో సభలోనే సెల్‌ఫోన్‌లో నీలిచిత్రాలు చూసిన చరిత్ర బీజేపీదని ధ్వజమెత్తారు. ఉత్తర కర్ణాటక ప్రజలతో పాటు రైతుల సమస్యలపై సభలో చర్చ జరుగుతున్న సమయంలో సెల్‌ఫోన్ చూస్తూ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిన ప్రభు చౌహాన్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఇక ఇప్పటికే తమ పార్టీ శాసనసభ్యులకు సైతం శాసనసభలోకి ప్రవేశించే ముందే ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాల్సిందిగా సూచించినట్లు వెల్లడించారు.   అనంతరం కాంగ్రెస్ ఎమ్మల్సీ వీఎస్ ఉగ్రప్ప మాట్లాడుతూ...అమ్మాయిల ఫొటోలను అసభ్య రీతిలో చూస్తూ బీజేపీ నేతలు మరోసారి తమ గుణాన్ని చాటుకున్నారని విమర్శించారు. శాసనసభ సమావేశాల సమయంలో సెల్‌ఫోన్‌ను వాడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement