ఇవాళే అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది! ఎందుకంటే..? India Set To Witness Shortest Day Of The Year Today Why | Sakshi
Sakshi News home page

అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది ఈ రోజే! ఎందుకలా జరుగుతుందంటే..?

Published Fri, Dec 22 2023 11:10 AM | Last Updated on Fri, Dec 22 2023 11:18 AM

India Set To Witness Shortest Day Of The Year Today Why - Sakshi

శీతకాలంలో సాధారణంగా పగటి పూట తక్కువగానూ రాత్రి సమయం ఎక్కువగానూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసింది. కానీ ఈ శీతకాలంలో ఒక రోజు మాత్రం మిగతా అన్ని రోజుల కంటే పగటి పూట తక్కువగా ఉంటుంది. ఈసారి అయినా అది గమినించండి. సాధారణంగా దీన్ని గమనించం. ఇలా తక్కువ పగటికాలం ఉన్న రోజుని శీతాకాలపు అయానంతం అని కూడా పిలుస్తారు. అలా పగటి పూట తక్కువగా ఉన్న రోజు ప్రతి ఏడాది డిసెంబర్‌ 21 లేదా డిసెంబర్‌ 22ల మధ్యే వస్తుంది. అయితే ఈ ఏడాది ఇవాళే(డిసెంబర్‌22) అత్యంత తక్కువ పగటి పూట ఉంటుందట. 

నిజానికి మనకు ఏడాదిలో రెండు అయనాంతాలు ఉంటాయి ఒకటి జూన్‌ 21న ఇంకొకటి డిసెంబర్‌ 21న సంభవిస్తుంది. ఇక్కడ అయనాంత అంటే భూమధ్యరేఖకు సంబంధించి సూర్యుడు తన అత్యంత ఉత్తర లేదా దక్షిణ ధృవానికి చేరుకోవడంతో సంభవించే ఒక సంఘటన. 

ఎందువల్ల అలా జరుగుతుందంటే..

బొంగరంలా తిరిగేటప్పుడు భూమి ధ్రువం తన అక్షం నుంచి కొన్ని డిగ్రీలతో సూర్యుడికి దూరంగా వంగుతుంది. భూమి ధ్రువం ఎప్పుడైతే భానుడికి దూరంగా గరిష్ఠంగా వంగుతుందో అప్పుడు దక్షిణాయనం(winter solstice) ఏర్పడుతుంది. దక్షిణాయనం ఏర్పడినప్పుడు సూర్యకిరణాలు భూమిపై ఎక్కువగా పడవు. అందువల్ల ఈ రోజు భూమిపై ఎక్కువ రేపు రాత్రి సమయాన్ని అనుభవిస్తాం. అలాగే పగటిపూట అనేది తక్కువగా ఉంటుంది. దక్షిణాయనం అనేది చలికాలానికి సూచిక.

ఒకసారి ఉత్తర అర్ధగోళంలో.. ఒకసారి దక్షిణ అర్ధగోళంలో భూమి సూర్యుడి వైపుకు తిరగడం.. సూర్యుడి వైపు కాకుండా మరో వైపు వంగడం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా రెండు సార్లు జరుగుతుంది. అయితే సూర్యుని వైపు వంగి ఉంటే పగటి సమయం ఎక్కువగా.. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది

ఎలా తెలుస్తుందంటే..
ఈ అయనాంతం ఉదయం 8.57 గంటలకు సంభవిస్తుంది. అంటే ఈ రోజు దాదాపు 7 గంటల 14 నిమిషాలు మాత్రమే వెలుతురు(పగటి పూట) ఉంటుంది. 

ఎలా తెలుసుకోగలం అంటే..
ఈ రోజు సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని గమనిస్తే క్లియర్‌గా తెలుస్తుంది. చీకటి పడుతున్న తర్వాత నక్షత్రాలు వచ్చే విధానాన్ని చూస్తే తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

(చదవండి: నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement