solicitation
-
ఇవాళే అత్యంత తక్కువ పగటి కాలం ఉండేది! ఎందుకంటే..?
శీతకాలంలో సాధారణంగా పగటి పూట తక్కువగానూ రాత్రి సమయం ఎక్కువగానూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసింది. కానీ ఈ శీతకాలంలో ఒక రోజు మాత్రం మిగతా అన్ని రోజుల కంటే పగటి పూట తక్కువగా ఉంటుంది. ఈసారి అయినా అది గమినించండి. సాధారణంగా దీన్ని గమనించం. ఇలా తక్కువ పగటికాలం ఉన్న రోజుని శీతాకాలపు అయానంతం అని కూడా పిలుస్తారు. అలా పగటి పూట తక్కువగా ఉన్న రోజు ప్రతి ఏడాది డిసెంబర్ 21 లేదా డిసెంబర్ 22ల మధ్యే వస్తుంది. అయితే ఈ ఏడాది ఇవాళే(డిసెంబర్22) అత్యంత తక్కువ పగటి పూట ఉంటుందట. నిజానికి మనకు ఏడాదిలో రెండు అయనాంతాలు ఉంటాయి ఒకటి జూన్ 21న ఇంకొకటి డిసెంబర్ 21న సంభవిస్తుంది. ఇక్కడ అయనాంత అంటే భూమధ్యరేఖకు సంబంధించి సూర్యుడు తన అత్యంత ఉత్తర లేదా దక్షిణ ధృవానికి చేరుకోవడంతో సంభవించే ఒక సంఘటన. ఎందువల్ల అలా జరుగుతుందంటే.. బొంగరంలా తిరిగేటప్పుడు భూమి ధ్రువం తన అక్షం నుంచి కొన్ని డిగ్రీలతో సూర్యుడికి దూరంగా వంగుతుంది. భూమి ధ్రువం ఎప్పుడైతే భానుడికి దూరంగా గరిష్ఠంగా వంగుతుందో అప్పుడు దక్షిణాయనం(winter solstice) ఏర్పడుతుంది. దక్షిణాయనం ఏర్పడినప్పుడు సూర్యకిరణాలు భూమిపై ఎక్కువగా పడవు. అందువల్ల ఈ రోజు భూమిపై ఎక్కువ రేపు రాత్రి సమయాన్ని అనుభవిస్తాం. అలాగే పగటిపూట అనేది తక్కువగా ఉంటుంది. దక్షిణాయనం అనేది చలికాలానికి సూచిక. ఒకసారి ఉత్తర అర్ధగోళంలో.. ఒకసారి దక్షిణ అర్ధగోళంలో భూమి సూర్యుడి వైపుకు తిరగడం.. సూర్యుడి వైపు కాకుండా మరో వైపు వంగడం జరుగుతుంది. ఇది ప్రతి ఏటా రెండు సార్లు జరుగుతుంది. అయితే సూర్యుని వైపు వంగి ఉంటే పగటి సమయం ఎక్కువగా.. రాత్రి సమయం తక్కువగా ఉంటుంది ఎలా తెలుస్తుందంటే.. ఈ అయనాంతం ఉదయం 8.57 గంటలకు సంభవిస్తుంది. అంటే ఈ రోజు దాదాపు 7 గంటల 14 నిమిషాలు మాత్రమే వెలుతురు(పగటి పూట) ఉంటుంది. ఎలా తెలుసుకోగలం అంటే.. ఈ రోజు సూర్యోదయం లేదా సూర్యాస్తమయాన్ని గమనిస్తే క్లియర్గా తెలుస్తుంది. చీకటి పడుతున్న తర్వాత నక్షత్రాలు వచ్చే విధానాన్ని చూస్తే తెలుస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. (చదవండి: నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా చేయండి!) -
వికేంద్రీకరణ కోసం.. అంబెద్కర్ విగ్రహానికి వినతి
సాక్షి, పశ్చిమ గోదావరి: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాధించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి: ఐటీ సోదాల్లో ఎలుకలు దొరికాయని.. ఇంకా సోదాలు చేస్తే ఏనుగులు, ఒంటెలు బయట పడతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విఆర్ ఎలిజా అన్నారు. ఆయన శనివారం మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని జిల్లాలోని జంగారెడ్డిగూడెం బస్స్టాప్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయుకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విఆర్ ఎలిజా మాట్లాడుతూ.. టీడీపీ నాయకులు అమరావతిలో పేద రైతుల వద్ద భూములు కొని ప్రభుత్వానికి అమ్మి.. బినామీ పేరుతో కంపెనీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. హవాలా పద్ధతిలో వేల కోట్లు కాజేసిన చంద్రబాబు నాయుడిపై ఐటీ, ఈడీ, సీబీఐ సంస్థలు సమగ్ర విచారణ చేయాలన్నారు. పశ్చిమగోదావరి: తాడేపల్లిగూడెంలో అభివృద్ధి వికేంద్రీకరణపై చంద్రబాబు వైఖరికి నిరసనగా చేపట్టిని రిలే నిరాహార దీక్షలు పన్నెండవ రోజు కొనసాగుతున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు విశాల్ పాల్గొన్నారు. దీక్ష చేస్తున్న నాయకులకు ఆయన సంఘీభావం తెలిపారు. పశ్చిమ గోదావరి: మూడు రాజధానుల విషయంలో చంద్రబాబు నాయుడుకి మంచి బుద్ది ప్రసాదించాలని వైఎస్సార్సీపీ జిల్లా యువజన అధ్యక్షులు మంతెన యోగేంద్రబాబు పాలకోడేరు మండలం శృంగవృక్షం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు , నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉండి గ్రామ వైఎస్సార్పీపీ కన్వీనర్ గుళ్ళు గొళ్లిపల్లి అచ్చారావు, ఉండి నియోజకవర్గ మహిళా కన్వీనర్ కటిక శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంతెన యోగేంద్రబాబు మట్లాడుతూ.. చంద్రబాబు దోచుకున్న రెండు లక్షల కోట్ల మోసం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందన్నారు. త్వరలోనే టీడీపీకి ప్రజలందరూ బుద్ధి చెబుతారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ నాలుగు గోడల మధ్య దాక్కొని నోరు మెదపడం లేదు ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రకాశం: మూడు రాజధానులకు మద్దతుగా సింగరాయకొండ, టంగుటూరు, కొండెపిల్లో అంబేద్కర్ విగ్రహాలకు కొండేపి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య వినతి పత్రం సమర్పించారు. గుంటూరు: రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, మేరుగ నాగార్జున అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, వినతి పత్రం సమర్పించారు. అనంతపురం: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని మడకశిర ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామి అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ వద్ద ప్రజల వద్ద నుంచి కొల్లగొట్టిన రూ. 2 వేల కోట్లు పట్టుబడడం చంద్రబాబు అవినీతికి నిదర్శనమన్నారు. చంద్రబాబు గత 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల డబ్బును దోచుకున్నారని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఆయన కోరారు. చంద్రబాబు దోచుకున్న అక్రమ సంపాదనను రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తిప్పే స్వామి అన్నారు. అనంతపురం: మూడు రాజధానులకు మద్దతుగా, చంద్రబాబుకు మంచి బుద్ధి ఇవ్వాలని.. రాయదుర్గం మండలం మురిడి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి వినతిపత్రం అందజేశారు. అనంతపురం: అధికార వికేంద్రీకరణ స్వాగతిస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం నేతలు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అదే విధంగా చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని కార్యకర్తలు, నేతలు వినతిపత్రాన్ని సమర్పించారు. -
హుందాగా ఉండండి
కుమారకు జేడీఎస్ఎల్పీ హితవు తీరు మార్చుకోవాలని సభ్యుల విన్నపాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : జేడీఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి ఉన్నారనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బెంగళూరులోని ఓ హోటల్లో బుధవారం ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశాన్ని నిర్వహించారు. హెచ్డీ. కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు తమ మనసులోని అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పారు. జేడీఎల్పీ నాయకుని హోదాలో కుమార స్వామి హుందాగా వ్యవహరించాలని పలువురు ఎమ్మెల్యేలు హితవు పలికారు. ‘మా నియోజక వర్గాల్లో పార్టీ కార్యకర్తలు మీ గురించి అడుగుతున్నారు, మీరేమో బెంగళూరు వదిలి వచ్చేట్లు లేరు’ అంటూ కుమారస్వామిని కొందరు ఎమ్మెల్యేలు నిష్టూరమాడినట్లు తెలిసింది. పార్టీని బలోపేతం చేయడానికి రాష్ట్ర పర్యటన చేపట్టాలని సూచించారు. ఈ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. కుమారస్వామికి అత్యంత సన్నిహితుడైన బెంగళూరులోని చామరాజపేట ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ గైర్హాజరవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తనకు ఈ సమావేశం గురించి ఆహ్వానం అందలేదని, కనుక హాజరయ్యేది లేదని జమీర్ మంగళవారమే తేల్చి చెప్పారు. అయితే ముందే నిర్ణయమైన కార్యక్రమాల వల్ల హఠాత్తుగా ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాలేక పోతున్నామని పలువురు ఎమ్మెల్యేలు రాత పూర్వకంగా తెలియజేశారని మాజీ మంత్రి, కుమారస్వామి సోదరుడు రేవణ్ణ విలేకరులకు తెలిపారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా కుమారస్వామిని, లెజిస్లేచర్ పార్టీ నాయకుడుగా తనను నియమిస్తారని వెలువడుతున్న వార్తలు ఊహాజనితాలని కొట్టి పారేశారు. తాను లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని కోరుకోవడం లేదన్నారు. కోర్ కమిటీ ఏర్పాటు పార్టీకి దిశా నిర్దేశం చేయడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కోర్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. లెజిస్లేచర్ పార్టీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో అతివృష్టి పీడిత ప్రాంతాల్లో పర్యటనకు నాలుగు బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పర్యటన అనంతరం ఈ బృందాలు సమర్పించే నివేదిక ఆధారంగా సహాయక చర్యల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. తమ పార్టీ పనై పోయిందని కొందరు చేస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తూ, కర్ణాటక రాజకీయాల్లో జేడీఎస్ అవిభాజ్య అవయవమని తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలకు అవకాశం ఇచ్చినందున, వచ్చే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీని ప్రజలు ఆశీర్వదించినా ఆశ్చర్యం లేదని అన్నారు. అతివృష్టి పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు దండిగా నిధులిస్తున్నామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేస్తున్న ప్రకటన వట్టి బూటకమని విమర్శించారు. అరకొర నిధులు విదిలిస్తున్నారని ఆరోపించారు.