రాహుల్ పోలీస్ సలహాలు పాటించడం లేదు..
Published Tue, Aug 8 2017 12:40 PM | Last Updated on Mon, Sep 11 2017 11:36 PM
♦ కేంద్రహోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారు దాడిపై పార్లమెంటులో దుమారం రేగింది. కాంగ్రెస్ పార్టీ నేత మల్లి ఖార్జున్ ఖర్గే దాడిని ఖండిస్తూ ఈ అంశాన్ని సభలో లెవనెత్తారు. బీజేపీ కార్యకర్తలు రాహుల్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీనికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు.
ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వం విచారణ జరుపుతోందని ఇప్పటికే ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. రాహుల్ ఎస్పీజీ పోలీసుల భద్రత లేకుండా ఇప్పటికి 6 సార్లు దేశం విడిచి వెళ్లారని, పోలీస్ సలహాలు పాటించడంలేదని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనకు బుల్లెట్ ఫ్రూఫ్ కారులో ఎందుకు వెళ్లలేదని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గుజరాత్ వరద బాధితులను పరామర్శించేందకు వెళ్లిన రాహుల్ గాంధీ కారు పై రాళ్లతో దాడి జరిగిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement