ఢిల్లీ : కొనసాగుతున్న పార్లమెంట్ సీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే అధికార, ప్రతిపక్ష సభ్యుల మద్య వాగ్వాదం మొదలైంది.
అమెరికాలో అదానీపై వచ్చిన ఆరోపణలపై చర్చ జరపాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పట్టుబడుతుంటే.. దేశ వ్యతిరేక కార్యలాపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌తో కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాంధీ సంబంధాల వ్యవహారంపై చర్చ జరపాలని బీజేపీ పట్టుబట్టింది. దీనిపై ప్రభుత్వ, ప్రతిపక్షాల ఆందోళనలు, పరస్పర ఆరోపణ, విమర్శలతో ఉభయ సభలూ
పలు మార్లు వాయిదా పడ్డాయి.
#WATCH | Delhi | After both Houses are adjourned till noon, Opposition MPs protest on the steps of the Parliament on Adani issue, demand reply from the government on the issue pic.twitter.com/S6g59PDBHw
— ANI (@ANI) December 10, 2024
అమెరికా వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులతో పనిచేస్తున్న ఫోరమ్ ఆఫ్ ది డెమోక్రటిక్ లీడర్స్-ఆసియా ఫసిఫిక్ ఫౌండేషన్ (ఎఫ్‌డీఎల్-ఏపీ)కు సహఅధ్యక్షురాలిగా ఉన్న సోనియాగాందీ.. ఆ సంస్థలో తన పాత్రపై స్పష్ట ఇవ్వాలని చెప్పేది మేంకాదని, పబ్లిక్ డొమైన్ ఉందని అందరికి తెలుసని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.
రాహుల్ గాంధీ ప్రవర్తన, అతని కార్యకలాపాలన్నింటి గురించి ప్రజలకు బాగా తెలుసు. జాతీయ ప్రయోజనాల విషయానికి వస్తే, మనమందరం కలిసి నిలబడాలి మరియు ఐక్యంగా ఉండాలి. జార్జ్ సోరోస్ భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాలని అనుకుంటున్నారు. ఇది దేశంలోని ప్రతి పౌరుడికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం’అని మీడియాతో మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment