కట్టుదిట్టమైన భద్రత, అనుక్షణం పోలీసు పహారాలో ఉండే పార్లమెంట్ ఎగ్జిట్ గేట్ నుంచి ఓ వాహనం లోపలికి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారుల కళ్లుగప్పి నిష్క్రమణ ద్వారం నుంచి బారికేడ్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన కారును అడ్డుకున్న భద్రతాధికారులు ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు.