సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలు శనివారం పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అభియాన్‌కు పూనుకున్నారు. ఎంపీలు హేమా మాలిని, కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్‌లు పార్లమెంట్ బయట చీపురుకట్ట చేతబట్టి శుభ్రం చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే వీరిపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు.
‘‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలో (పార్లమెంట్) స్వచ్ఛ భారత్‌ను చేస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా పార్లమెంట్ ముందు పాటించిన శుభ్రత పాటించరు. ముఖ్యంగా సమావేశాలు జరిగే రోజుల్లో ఇంకా శుభ్రతను పాటిస్తారు. మీరు మాత్రం అక్కడే శుభ్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో?. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఈ కార్యక్రమానికి దిగినట్టు ఉంది’’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి హేమా మాలిని గెలిచిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment