swacha Bharat Abhiyan
-
స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై
-
అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలు శనివారం పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అభియాన్‌కు పూనుకున్నారు. ఎంపీలు హేమా మాలిని, కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్‌లు పార్లమెంట్ బయట చీపురుకట్ట చేతబట్టి శుభ్రం చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే వీరిపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. ‘‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలో (పార్లమెంట్) స్వచ్ఛ భారత్‌ను చేస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా పార్లమెంట్ ముందు పాటించిన శుభ్రత పాటించరు. ముఖ్యంగా సమావేశాలు జరిగే రోజుల్లో ఇంకా శుభ్రతను పాటిస్తారు. మీరు మాత్రం అక్కడే శుభ్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో?. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఈ కార్యక్రమానికి దిగినట్టు ఉంది’’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి హేమా మాలిని గెలిచిన విషయం తెలిసిందే. -
చేతితో టాయిలెట్‌ను శుభ్రపరిచిన ఎంపీ
భోపాల్ : చేతితో టాయిలెట్‌ను శుభ్రపరిచి సోషల్ మీడియాలో హీరో అయ్యారు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా. మధ్యప్రదేశ్‌లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో ఉపయోగించడంలేదని, బయటకే వెళ్తున్నామని చెప్పారు. దీంతో వెంటనే వాటిని పరిశీలించిన ఆయన చీపురు చేత పట్టి టాయిలెట్స్‌ను శుభ్రపరిచారు. ఏకంగా తన ఎడమ చేతితో లోపల కూరుకుపోయిన చెత్తను తీసి స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఫొజులివ్వడం కాదు.. చేసి చూపించాలని చాటి చెప్పాడు. ఈ వీడియోను ఆయనే స్వయంగా ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ గత బుధవారం జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఇక ఈ విషయాన్ని సైతం నెటిజన్లు ప్రస్తావిస్తూ జనార్థన్ మిశ్రాను కొనియాడుతున్నారు. -
చేతితో స్కూల్ టాయిలెట్ శుభ్రపరిచిన ఎంపీ
-
ఫ్యాన్స్‌కు ప్రభాస్ మెసేజ్..
సాక్షి, హైదరాబాద్: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ మెసేజ్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సెలబ్రేటీలకు ఇచ్చిన ‘స్వచ్ఛతా హీ సేవ’కు ఇప్పటికే పలువురు సెలబ్రేటీలు స్పందించారు. అయితే ఈ రెబల్‌స్టార్ తనదైన శైలిలో ఫ్యాన్స్‌కు స్వచ్చతాహీ సేవలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ‘అద్భుతమైన నా అభిమానులందరికీ.. భారత దేశ స్వచ్ఛత గురించి తపించిన మహాత్మగాంధీ జయంతి సందర్భంగా మనమంతా స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగమవుదాం. భారత్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమంలో నాకు అవకాశం రావడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను. నాదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం నా డ్యూటీ కాదు ఓ పౌరునిగా నా బాధ్యత. మీరు కూడా నాలానే ఫీలవుతున్నారని భావిస్తున్నా. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ స్వచ్చమైన భారత్‌ను నిర్మిద్దాం. ఇప్పటికే అందంగా ఉన్న నాదేశం మరింత అందంగా తయారవుతోందని’ ప్రభాస్ అభిమానులకు ఫేస్బుక్ పోస్టుతో పిలుపునిచ్చాడు. ఈ పోస్టుపై అభిమానులు ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. -
స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు!
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' వీడియో యూట్యూబ్‌లో పది లక్షల హిట్లు దాటేసింది. ఆర్- విజన్ ఇండియా ఎండీ రవీంద్ర సింగ్ నిర్మించి, పాడిన ఈ వీడియోకు 'ఏక్ భారత్ర శ్రేష్ఠ భారత్' అనే టైటిల్ పెట్టారు. దేశ ప్రజల కోసం దేశం అంతా పరిశుభ్రంగా ఉండాలన్న సందేశాన్ని ఈ వీడియో ఇస్తుంది. ప్రధానమంత్రి ఆలోచనలను, ఆయన దూరదృష్టిని ఈ వీడియో ద్వారా ప్రజలకు అందజేయాలని తాము ప్రయత్నించినట్లు రవీంద్ర సింగ్ చెప్పారు. రాణీ మాలిక్ రాసిన ఈ పాటకు.. మానెక్, సత్య, అఫ్సర్ సంగీతం అందించారు. ఈ వీడియోకు రాజీవ్ ఖండేల్వాల్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వీడియోలో కనిపిస్తారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్
సంగారెడ్డి రూరల్: ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్ అభియాన్ సాధ్యమవుతుందని కలెక్టర్ రాహుల్ బొజ్జా పేర్కొన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి మండలం నాగాపూర్‌లో సర్పంచ్ కటకం రాజు అధ్యక్షతన గురువారం జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని మహాత్మాగాంధీ పేర్కొన్నారన్నారు. దేశంలోని గ్రామాలన్నీ పరిశుభ్రమైన గ్రామాలుగా మారాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు, పరిసరాలు , గ్రామాల శుభ్రతకు కృషిచేయాలని సూచించారు. పారిశుద్ధ్య లోపంతో అనారోగ్యానికి గురైతే డబ్బు వృధా అవుతుందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం సక్రమంగా లేకపోవడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ సాధన కోసం ప్రతి ఒక్కరు ఏడాదికి వంద గంటలు, వారానికి రెండు గంటలు శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు. నాబార్డ్ సీజీఎం జీజీ మెమన్ మాట్లాడుతూ నాబార్డ్ ఆధ్వర్యంలో జిల్లాలో వర్మి కంపోస్ట్ ప్రాజెక్ట్‌ను, డెయిరీ, బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అంతకు ముందు కలెక్టర్, ఎమ్మెల్యే,తదితరులు మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని వీధులను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ మధుకర్‌రెడ్డి, డీఆర్డీఏ పీపీ రవీందర్‌రెడ్డి, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, నాబార్డ్ జీఎం కిషన్ సింగ్, డీజీఎం షెవుడే, డీడీఎం రమేష్, తహాశీల్దార్ గోవర్థన్, ఎంపీడీఓ సరళ, ఈఓపీఆర్డీ సంధ్య, జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్, ఎంపీటీసీ క్రిష్ణవేణి అశోక్‌గౌడ్‌తో పాటు వివిధశాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్ కోసం కృషి : భెల్ ఈడీ రవిచందర్ రామచంద్రాపురం: స్వచ్ఛ భారత్ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భెల్ ఈడీ రవిచందర్ పేర్కొన్నారు. గురువారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా భెల్ పరిశ్రమ ముఖధ్వారం నుంచి బుధవారం సంత వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం బుధవారం సంత ప్రాంగణాన్ని భెల్ ఈడీతో పాటు అధికారులు, కార్మికులు శుభ్రపరిచారు. అనంతరం రవిచందర్ మాట్లాడుతూ కార్మికులు ప్రతి శనివారం రెండు గంటలు పరిసరాలను శుభ్రపరిచేందుకు సమయం కేటాయించాలన్నారు. శ్రమదానం నిర్వహించి స్వచ్ఛ భారత్ సాధనకు కృషి చేయాలన్నారు.