
చేతితో టాయిలెట్ క్లీన్ చేస్తున్న ఎంపీ జనార్ధన్ మిశ్రా
భోపాల్ : చేతితో టాయిలెట్‌ను శుభ్రపరిచి సోషల్ మీడియాలో హీరో అయ్యారు బీజేపీ ఎంపీ జనార్ధన్ మిశ్రా. మధ్యప్రదేశ్‌లోని రివా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఓ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ స్కూల్ విద్యార్థులు పాఠశాల మరుగుదొడ్లు సక్రమంగా లేకపోవడంతో ఉపయోగించడంలేదని, బయటకే వెళ్తున్నామని చెప్పారు.
దీంతో వెంటనే వాటిని పరిశీలించిన ఆయన చీపురు చేత పట్టి టాయిలెట్స్‌ను శుభ్రపరిచారు. ఏకంగా తన ఎడమ చేతితో లోపల కూరుకుపోయిన చెత్తను తీసి స్వచ్ఛభారత్ ప్రచార కార్యక్రమంలో ఫొజులివ్వడం కాదు.. చేసి చూపించాలని చాటి చెప్పాడు. ఈ వీడియోను ఆయనే స్వయంగా ట్వీట్ చేయడంతో వైరల్ అయింది. ఆయనపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ గత బుధవారం జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోసి విమర్శల పాలైన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. ఇక ఈ విషయాన్ని సైతం నెటిజన్లు ప్రస్తావిస్తూ జనార్థన్ మిశ్రాను కొనియాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment