ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ మెసేజ్‌.. | Baahubali Prabhas’ latest FB post is inspiring  | Sakshi
Sakshi News home page

ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ మెసేజ్‌..

Published Sat, Sep 30 2017 9:20 AM | Last Updated on Wed, Oct 3 2018 7:48 PM

 Baahubali Prabhas’ latest FB post is inspiring  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను పొందిన టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఓ మెసేజ్‌పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.  మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సెలబ్రేటీలకు ఇచ్చిన ‘స్వచ్ఛతా హీ సేవ’కు ఇప్పటికే పలువురు సెలబ్రేటీలు స్పందించారు.

అయితే ఈ రెబల్‌స్టార్‌ తనదైన శైలిలో ఫ్యాన్స్‌కు స్వచ్చతాహీ సేవలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ‘అద్భుతమైన నా అభిమానులందరికీ.. భారత దేశ స్వచ్ఛత గురించి తపించిన మహాత్మగాంధీ జయంతి సందర్భంగా మనమంతా స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగమవుదాం.  భారత్‌ను పరిశుభ్రంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమంలో నాకు అవకాశం రావడం గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను. నాదేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం నా డ్యూటీ కాదు ఓ పౌరునిగా నా బాధ్యత. మీరు కూడా నాలానే ఫీలవుతున్నారని భావిస్తున్నా. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ స్వచ్చమైన భారత్‌ను నిర్మిద్దాం. ఇప్పటికే అందంగా ఉన్న నాదేశం మరింత అందంగా తయారవుతోందని’  ప్రభాస్‌ అభిమానులకు ఫేస్‌బుక్‌ పోస్టుతో పిలుపునిచ్చాడు. ఈ పోస్టుపై అభిమానులు ప్రభాస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement