స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు! | 'Ek Bharat Shreshtha Bharat' video crosses 1 million hits on YouTube | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు!

Published Sat, Nov 1 2014 10:30 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు! - Sakshi

స్వచ్ఛ భారత్ వీడియోకు పది లక్షల హిట్లు!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛ భారత్ అభియాన్' వీడియో యూట్యూబ్లో పది లక్షల హిట్లు దాటేసింది. ఆర్- విజన్ ఇండియా ఎండీ రవీంద్ర సింగ్ నిర్మించి, పాడిన ఈ వీడియోకు 'ఏక్ భారత్ర శ్రేష్ఠ భారత్' అనే టైటిల్ పెట్టారు. దేశ ప్రజల కోసం దేశం అంతా పరిశుభ్రంగా ఉండాలన్న సందేశాన్ని ఈ వీడియో ఇస్తుంది. ప్రధానమంత్రి ఆలోచనలను, ఆయన దూరదృష్టిని ఈ వీడియో ద్వారా ప్రజలకు అందజేయాలని తాము ప్రయత్నించినట్లు రవీంద్ర సింగ్ చెప్పారు.

రాణీ మాలిక్ రాసిన ఈ పాటకు.. మానెక్, సత్య, అఫ్సర్ సంగీతం అందించారు. ఈ వీడియోకు రాజీవ్ ఖండేల్వాల్ దర్శకత్వం వహించారు. సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, హీరోలు సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ లాంటి అనేకమంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వీడియోలో కనిపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement