national conferece
-
నేను జైలులో ఉన్నప్పుడు.. వాళ్లు తోలు బొమ్మలు: ఇంజనీర్ రషీద్
శ్రీనగర్: బీజేపీ అనుకూల వ్యక్తిగా తనపై వస్తున్న ఆరోపణలను అవామీ ఇత్తెహాద్ పార్టీ(ఏఐపీ) చీఫ్, బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ (షేక్ అబ్దుల్ రషీద్) ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తన గెలుపు ప్రధాని మోదీ ‘నయా కశ్మీర్’ విధానాల వల్ల ప్రజల్లో కలిగిన అసంతృప్తికి నిదర్శరనమని అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.‘‘నాపై బీజేపీ అనుకూల వ్యక్తిని అనే ఆరోపణలు చేయటం చాలా సిగ్గుచేటు. ఇలాంటి ఆరోపణలు చేసినవాళ్లు సిగ్గుపడాలి. నేను ఒక్కడినే బీజేపీ చేతిలో బలిపశువును అయ్యాను. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ఫరూఖ్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలను కొన్ని నెలల పాటు గృహనిర్బంధంలో ఉంచారు. కానీ, నేను మాత్రం తిహార్ జైల్లో ఉన్నా. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ఒమర్ అబ్దుల్లా , పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)కి చెందిన మెహబూబా ముఫ్తీలు ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత జమ్ము కశ్మీర్ ప్రజలను ఏకం చేయటంలో విఫలమయ్యారు. కశ్మీర్ ప్రజలు దృష్టిలో ఒమర్ అబ్దుల్లా.. మహాత్మా గాంధీ లేదా సుభాష్ చంద్రబోస్ కాలేదు. మెహబూబా ముఫ్తీ రజియా సుల్తాన్ లేదా మయన్మార్‌కు చెందిన ఆంగ్ సాన్ సూకీ కాలేకపోయారు. తోలుబొమ్మలు, రబ్బరు స్టాంపులుగా మిగిలి పోయారు.2019లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన ఆరోపణలపై రషీద్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది. జమ్ము కశ్వీర్ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ 10న తన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం చేసేందుకు ఆయను అక్టోబర్ 2 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. 2024 సార్వత్రిక ఎన్నికలలో ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో రషీద్ ఒమర్ అబ్దుల్లాపై విజయం సాధించారు.చదవండి: ఎన్నికల వేళ.. హర్యానా బీజేపీలో ట్విస్ట్! -
‘ఆర్టికల్ 370 రద్దుపై ఓటుతో కేంద్రానికి సందేశం పంపండి’
శ్రీనగర్: 2024 లోక్‌సభ ఎన్నికలు జమ్మూ కశ్మీర్‌కు చాలా ముఖ్యమైనవని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఎన్నికల ద్వారా కేంద్రానికి కశ్మీర్ ప్రజలు ఒక ప్రశ్నకు గట్టి సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల ద్వారా 5 ఆగస్టు, 2019 రోజున కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైందా?.. కాదా? అనేది తెలియజేయాలన్నారు. బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఒమర్ అబ్దుల్లా పాల్గొని మాట్లాడారు. ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి మీది తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తే.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయకండి. మీ జీవితాలు గతం కంటే మేరుగ్గా మారినట్లు భావిస్తే మాకు ఓటు వేయకండి. కేంద్రం తీసుకున్న నిర్ణయం మనకు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదని మీ ఓటు ద్వారా కేంద్రంలోని బీజేపీకి సందేశం పంపండి. 5, ఆగస్టు 2019న కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయమని భావిస్తే నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయండి. నిరసన చేపట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఓటు ద్వారా కేంద్రానికి స్పష్టమైన సందేశం పంపాలి. మనం శాంతిని దూరం చేసే రాళ్లు విసిరే యువత కాదు. మనం శాంతిని నెలకొల్పడం కోసం త్యాగాలు చేసిన వాళ్లం’ అని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. లోకసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్ పోటీ చేయగా.. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి జమ్ములోని రెండు స్థానాలు దక్కాయి. అయితే పీడీపీ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం. అయితే పొత్తులో భాగంగా అనంత్ నాగ్ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా పీడీపీ డిమాండ్ చేసింది. ఈ ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే అక్కడి నుంచి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పోటి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్లో ఏప్రిల్ 19నుంచి మే 20 వరకు ఐదు దఫాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. -
‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’
జమ్మూకశ్మీర్: ఆయోధ్యలో రామమందిర ప్రారంభం 2024 జనవరి 22న జరగనుంది. రామమందిర ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా రామమందిర ఏర్పాట్లపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయోధ్యలో రామమందిర నిర్మాణానికి రాత్రిపగలు కష్టపడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారత్దేశంలో సోదరభావంగా తగ్గిపోతోందని దానిని పునరుద్దరించాలని అన్నారు. రాముడు కేవలం హిందువలకు మాత్రమే సంబంధించి దేవుడు కాదని.. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సంబంధించిన దేవుడని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దేశ ప్రజలందరికీ తెలియజేస్తున్నానని చెప్పారు. భగవన్ రాముడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ దేవుడని అన్నారు. ఈ విషయం ఆధ్యాత్మిక చరిత్ర గ్రంథాల్లో సైతం రాయబడి ఉందని తెలియజేశారు. అయితే రాముడు సోదరభావం, ప్రేమ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఐకమత్యంతో ఉండాలని గొప్ప సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. మతాలకు సంబంధం లేకుండా అందరిని సమభావంతో చూడాలని రాముడి సందేశాల్లో ఉందని తెలిపారు. ఆయన విశ్వమానవులకు ఈ సందేశాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో రాముడు చెప్పిన సోదరభావం కొరవడిందని.. ప్రజలంతా కూడా సోదరభావాన్ని పాటించాలని ఫరూక్ అబ్దుల్లా అన్నారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానిమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. కాగా.. కొంతమంది ప్రతిపక్ష నాయకులకు ఆహ్వానం అందగా.. మరికొంత మందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించకపోవటం గమనార్హం. ఇక బీజేపీ రామమందిర నిర్మాణ ప్రారంభోత్సవాన్ని రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికలకు ఒక పావుగా మలుచుకుంటోందని ప్రతిపక్షాలు ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: Varanasi: కాశీ కలశాలలో సరయూ నీరు.. శ్రీరాముని జలాభిషేకానికి సన్నాహాలు! -
జిన్‌పింగ్‌కు మూడోసారి పట్టం!
జన చైనా అధినేతగా షీ జిన్‌పింగ్(69)ను వరుసగా మూడోసారి ఎన్నుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది. మరో ఐదేళ్లపాటు ఆయన పదవిలో కొనసాగడం ఖాయమే. అన్నీ అనుకున్నట్లు జరిగితే జీవితకాలం పదవిలో ఉండేలా అధికార చైనా కమ్యూనిస్ట్ పార్టీ(సీపీసీ) తీర్మానాన్ని ఆమోదించినా ఆశ్చర్యం లేదు. పార్టీ దివంగత నేత మావో జెడాంగ్ తర్వాత మూడుసార్లు చైనా అధ్యక్షుడిగా గద్దెనెక్కిన నాయకుడిగా జిన్‌పింగ్ రికార్డు సృష్టించబోతున్నారు. కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ సదస్సు ఈ నెల 16న జరుగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిన్‌పింగ్ జాగ్రత్తగా ‘ఎన్నిక చేసిన’ 2,296 మంది ప్రతినిధులు పాల్గొంటారు. వీరంతా జిన్‌పింగ్‌కు మరోసారి పట్టంకడతారు. ప్రపంచ శక్తిగా ఎదగాలని తహతహలాడుతున్న డ్రాగన్ దేశంపై అమెరికాతోపాటు పశ్చిమ దేశాలు గుర్రుగా ఉన్నాయి. చైనా దూకుడును అడ్డుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జిన్‌పింగ్ వరుసగా మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతుండడం ఆసక్తికరంగా మారింది. ’పదేళ్ల పదవీ కాలం’ విధానానికి మంగళం చైనాలో ’పదేళ్ల పదవీ కాలం’ అనే నిబంధనకు కాలం చెల్లబోతోంది. ఇన్నాళ్లూ ’రెండు పర్యాయాలు.. ఒక్కోటి ఐదేళ్లు’ అనే విధానం కఠినంగా అమలయ్యింది. అంటే ఒక అధ్యక్షుడు పదేళ్లకు మించి అధికారంలో కొనసాగడానికి వీల్లేదు. ఏకైక రాజకీయ పార్టీ ఉన్న చైనాలో ఏక వ్యక్తి ఆధిపత్యం అరాచకానికి దారితీస్తుందన్న అంచనాతో ఈ విధానం ప్రవేశపెట్టారు. మావో జెడాంగ్ మినహా జిన్‌పింగ్ కంటే ముందు అధికారంలో ఉన్న అధ్యక్షులంతా దీనికి కట్టుబడి ఉన్నారు. మావో జెడాంగ్ 1976 దాకా అధికారంలో కొనసాగారు. పాలనలో తన బ్రాండ్ అయిన ’జెడాంగ్ ఆలోచన’ను అమలు చేశారు. పెట్టుబడిదారులపై కఠిన ఆంక్షలు విధించారు. సాంస్కృతిక విప్లవం వంటి ప్రయోగాలు చేశారు. జెడాంగ్ పాలనలో చైనా దాదాపు దివాలా దశకు చేరుకుంది. అనంతరం సర్వోన్నత నాయకుడిగా పేరుగాంచిన డెంగ్ జియావోపింగ్ అధికారంలోకి వచ్చారు. మావో విధానాలకు మంగళం పాడుతూ తనదైన ఆర్థిక విధానాలకు తెరతీశారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేశారు. ఒకే వ్యక్తి సుదీర్ఘ కాలంలో అధికారంలో ఉంటే దేశానికి ముప్పేనన్న అంచనాతో ’పదేళ్ల పదవీ కాలాన్ని, 68 ఏళ్ల వయోపరిమితిని’ ప్రవేశపెట్టారు. 1982లో జరిగిన సీపీసీ 12వ జాతీయ సదస్సులో వీటికి ఆమోదం లభించింది. ఆ తర్వాత జియాంగ్ జెమిన్, హూ జింటావో అధికారంలోకి వచ్చారు. వారి హయాంలోనే చైనా ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ‘నూతన మావో’ జిన్‌పింగ్ 31953 జూన్ 15న జన్మించిన షీ జిన్‌పింగ్ 2008 నుంచి 2013 వరకూ హూ జింటావో హయాంలో చైనా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2012లో చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అటు పిమ్మట సెంట్రల్ మిలటరీ కమిషన్(సీఎంసీ) చైర్మన్‌గా మారారు. 2013 మార్చి 14న ‘పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా’ 7వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి నిరాటంకంగా కుర్చీని అధిరోహిస్తున్నారు. సైన్యం, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా జిన్‌పింగ్ నియంత్రణలోకి వచ్చాయి. మూడున్నర దశాబ్దాల తర్వాత ‘వన్ లీడర్’ పాలన మొదలయ్యింది. పదేళ్ల పదవీ కాలం నిబంధన ప్రకారం 2023లో ఆయన పాలన ముగిసిపోవాలి. కానీ, ‘నూతన మావో’ కావాలన్నది జిన్‌పింగ్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని ఆయన సాధించినట్లేనని చెప్పుకోవచ్చు. ► జిన్‌పింగ్ మరింత శక్తివంతమైన నాయకుడిగా అవతరించబోతున్నారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పదేళ్లలో అధికారాన్ని జిన్‌పింగ్ కేంద్రీకృతం చేశారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించారు. మాజీ అధినేతలతో పోలిస్తే ఎక్కువ అధికారాలను అనుభవిస్తున్నారు. ► జిన్‌పింగ్‌కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఆయన తండ్రి జోంగ్‌షున్ జైలుపాలయ్యారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న యువత గ్రామాల్లో రైతులతో కలిసి జీవించాలని మావో ఆదేశించడంతో 1969లో జిన్‌పింగ్ షాన్షీ ప్రావిన్స్‌లోని ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అక్కడ ఓ గుడిసెలోనే ఆరేళ్లపాటు జీవనం సాగింది. ► పల్లె జీవితం తర్వాత జిన్‌పింగ్ బీజింగ్‌లోని తిసింగ్‌హువా యూనివర్సిటీలో చేరారు. స్కాలర్‌షిప్‌తో చదువుకున్నారు. తర్వాత చైనా రక్షణశాఖలో మూడేళ్లపాటు పనిచేశారు. 1985లో ఫుజియాన్ ప్రావిన్స్‌లోని షియామెన్ నగర ఉపమేయర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరం నాటికి ఆదే పావిన్స్ గవర్నర్‌గా ఎదిగారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్ బీజింగ్ కౌంటీ కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ► 2002లో జెజీయాంగ్ ప్రావిన్స్‌లో పార్టీ చీఫ్‌గా, 2007లో షాంఘైలో పార్టీ కార్యదర్శిగా వ్యవహరించారు. పార్టీ పొలిట్‌బ్యూరోలో శక్తివంతమైన స్టాడింగ్ కమిటీలో సభ్యుడిగా చేరారు. ► చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పేరును ప్రతిపాదిస్తూ 2012లో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో తీర్మానాన్ని ఆమోదించారు. ► తైవాన్ విషయంలో అంతర్జాతీయంగా విమర్శలను ఎదుర్కొంటున్నారు. తైవాన్ను ఎట్టిపరిస్థితుల్లోనూ చైనాలో కలిపేసుకుంటామని జిన్‌పింగ్ చెబుతున్నారు. ► చైనాలో ప్రశ్నించే గొంతుకలను అణచివేయడం, మీడియాపై ఆంక్షలు సర్వసాధారణంగా మారాయి. ► హాంకాంగ్‌లో శాంతియుత నిరసనలను కఠినంగా అణచివేశారు. ► జిన్‌పింగ్ అమల్లోకి తీసుకొచ్చిన ‘జీరో–కోవిడ్’ పాలసీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాక్డౌన్లు కాదు, స్వేచ్ఛ కావాలంటూ జనం నినదిస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ప్రపంచ నేతగా భారత్! ప్రధాని మోదీ అభిలాష
న్యూఢిల్లీ: కరోనా కల్లోలం ముగిసిన తర్వాత భారత్ ప్రపంచ నాయకురాలిగా అవతరిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2047కు నూతన లక్ష్యాలతో ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృతోత్సవ్ జాతీయ కమిటీ రెండో సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ఆన్లైన్లో ప్రసంగించారు. కరోనా ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిందని, మూస భావనలను ధ్వంసం చేసిందని, దీనివల్ల భవిష్యత్‌లో ప్రపంచానికి కొత్త నాయకత్వం ఆవిర్భవించే అవకాశాలు పెరిగాయని చెప్పారు. 21వ శతాబ్దం ఆసియాదని అందరూ అంటారని, అయితే ఇందులో భారత్ స్థానంపై అందరం దృష్టి సారించాలని సూచించారు. దేశ స్వాతంత్య్ర శతసంవత్సరోత్సవాల నాటికి తగిన లక్ష్యాలను రూపొందించుకోవాలన్నారు. భారత్‌ను అగ్రగామిగా నిలిపేందుకు అందరూ ఎవరి బాధ్యతలు వాళ్లు సక్రమంగా నిర్వర్తించాలన్నారు. భవిష్యత్ ఎప్పుడూ గతంపైనే ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం మన పూర్వీకుల త్యాగఫలమని గుర్తించాలన్నారు. ఈ జాతీయ కమిటీలో లోక్‌సభ స్పీకర్, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా పలువురు ప్రముఖులున్నారు. ప్రస్తుత సమావేశంలో మాజీ ప్రధాని దేవేగౌడ, గవర్నర్లు ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆచార్య దేవవ్రత్, సీఎంలు వైఎస్ జగన్, యోగి ఆదిత్యనాధ్, అశోక్ గెహ్లాట్, బీజేపీ అధిపతి నడ్డా, ఎన్సీపీ అధిపతి శరద్ పవార్, ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్, నటుడు రజనీకాంత్ తమ అభిప్రాయాలు వెల్లడించారు. -
నగదు బదిలీతో రూ . 1,70,000 కోట్లు ఆదా
సాక్షి, న్యూఢిల్లీ : లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీల ద్వారా అవినీతి, కుంభకోణాలను నిరోధించగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పేదలు నూరు శాతం పొందుతున్నారని పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా 1,70,000 కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేయగలిగామని చెప్పారు. విజిలెన్స్, అవినీతి నిరోధక చర్యలపై ‘సతర్క్ భారత్..సమృద్ధ భారత్’ పేరిట మంగళవారం జరిగిన జాతీయ సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అవినీతి నియంత్రణలో గత ప్రభుత్వాల తీరును ప్రధాని తప్పుపట్టారు. చదవండి : డిమాండ్‌కు భారత్ ‘ఇంధనం’ గత దశాబ్ధాల్లో అవినీతి తరం శిక్షకు నోచుకోకపోవడంతో తర్వాతి తరం మరింత దూకుడుగా అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. దీంతో పలు రాష్ట్రాల్లో అవినీతి రాజకీయ సంప్రదాయంలో భాగంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తరాల తరబడి సాగిన అవినీతి దేశాన్ని చెదపురుగుల్లా తినేశాయని దుయ్యబట్టారు. నేడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు. పౌరుల జీవితాన్ని సరళతరం చేసేలా పలు పాత చట్టాలను తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు.అవినీతిపై మనం వ్యవస్థాగతంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అవినీతిని నియంత్రించేందుకు సామర్ధ్యాలకు పదునుపెట్టడంతో పాటు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు. -
మహిళల భద్రతలో పోలీసులే కీలకం
న్యూఢిల్లీ/పుణె: మహిళలకు భద్రత కల్పించడంలో పోలీసులు సమర్థవంతమైన పాత్ర నిర్వహించాలని ప్రధాని మోదీ అన్నారు. పుణెలో జరుగుతున్న 54వ డీజీపీ, ఐజీపీల జాతీయ సదస్సులో ఆదివారం ఆయన ప్రసంగించారు. పోలీసుల గౌరవాన్ని పెంచేలా అధికారులు కృషి చేయాలని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు..ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతపై విశ్వాసం పెంచాలని కోరారు. దేశంలో మహిళలపై పెరుగుతున్న నేరాలు, ప్రజల్లో పెరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సాధారణ పౌరుల నమ్మకాన్ని చూరగొనేందుకు పోలీసింగ్ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. పోలీసు అధికారులు నిత్యం విధి నిర్వహణలో ఎదుర్కొనే సవాళ్ల గురించి తనకు తెలుసునంటూ ప్రధాని..‘ఇలాంటివి ఎన్ని ఉన్నా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరైనప్పుడు ఉన్న ఉత్సాహం, ఆదర్శ భావాలను మనసులో ఉంచుకుంటూ జాతిహితం, సమాజంలోని పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు’అని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అవసరాల మేరకు చట్టాల్లో మార్పులు దేశ అవసరాలకు అనుగుణంగా చట్టాలను మార్చేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ)లను మెరుగుపరిచేందుకు అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హోం శాఖ కోరిన నేపథ్యంలో ఆయన ఈ విషయం వెల్లడించడం గమనార్హం. ఉగ్రవాద శక్తులను నిర్వీర్యం చేయాలి సార్క్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ సార్క్ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. ఉగ్రవాదాన్ని సమష్టిగా ఎదుర్కోవడంతోపాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని లేఖలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
అత్యంత శుభ్రమైన ప్రాంతంలో స్వచ్ఛ భారత్
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీలు శనివారం పార్లమెంట్ ఆవరణలో స్వచ్ఛ భారత్ అభియాన్‌కు పూనుకున్నారు. ఎంపీలు హేమా మాలిని, కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్‌లు పార్లమెంట్ బయట చీపురుకట్ట చేతబట్టి శుభ్రం చేశారు. త్వరలో మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల దృష్ట్యా 'స్వచ్ఛ భారత్ అభియాన్'కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే వీరిపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఒమర్ అబ్దుల్లా వ్యంగ్యంగా స్పందించారు. ‘‘దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన ప్రాంతంలో (పార్లమెంట్) స్వచ్ఛ భారత్‌ను చేస్తున్నారు. దేశంలో ఎక్కడా కూడా పార్లమెంట్ ముందు పాటించిన శుభ్రత పాటించరు. ముఖ్యంగా సమావేశాలు జరిగే రోజుల్లో ఇంకా శుభ్రతను పాటిస్తారు. మీరు మాత్రం అక్కడే శుభ్రం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో ఏమో?. కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికే ఈ కార్యక్రమానికి దిగినట్టు ఉంది’’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మధుర లోక్‌సభ నియోజకవర్గం నుంచి హేమా మాలిని గెలిచిన విషయం తెలిసిందే. -
ఫారూఖ్‌కు గట్టి పరీక్ష
జమ్మూ, కశ్మీర్ రాజధాని నియోజకవర్గమైన శ్రీనగర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు నాయకత్వం వహించే షేక్ అబ్దుల్లా కుటుంబ సభ్యులు ముగ్గురు గతంలో ఏడుసార్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు ఫారూఖ్ అబ్దుల్లా మరోసారి శ్రీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో అబ్దుల్లాను పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అభ్యర్థి తారిఖ్ హమీద్ కర్రా 42 వేలకు పైగా మెజారిటీతో ఓడించారు. 2017లో జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసిన అబ్దుల్లా తన సమీప పీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ ఖాన్‌పై పది వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ ఉప ఎన్నికలో జనం స్వల్ప సంఖ్యలో (7 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో ఫారూఖ్ అబ్దుల్లాతోపాటు ఆగా సయ్యద్ మొహిసిన్ (పీడీపీ), ఖాలిద్ జహంగీర్ (బీజేపీ) ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 2014లో ప్రస్తుత పీడీపీ అభ్యర్థి ఆగా మొహిసిన్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 16 వేల ఓట్లు సాధించారు. ఈ నెల 18న పోలింగ్ జరిగే శ్రీనగర్ స్థానంలో దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో మూడు జిల్లాలకు చెందిన 15 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అబ్దుల్లా కుటుంబానికి కంచుకోట ఫారూఖ్ అబ్దుల్లా తల్లి బేగం అక్బర్ జహాన్ ఒకసారి (1977), ఫారూఖ్ మూడుసార్లు (1980, 2009, 2017), ఆయన కొడుకు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మూడు సార్లు (1998, 99, 2004) శ్రీనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అంతకు ముందు ఎన్నికల్లో పరాజయం ఎరగని ఫారూఖ్ 2014లో నగరానికి చెందిన పీడీపీ అభ్యర్థి తారిఖ్ కర్రా చేతిలో ఓడిపోవడం సంచలనం అయింది. తర్వాత కర్రా పీడీపీకి, లోక్‌సభకు రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికలో ఫారూఖ్ విజయం సాధించారు. బీజేపీతో కలిసి కొన్నేళ్లు సంకీర్ణ సర్కారు నడిపిన తర్వాత విడిపోయిన కారణంగా పీడీపీకి జనాదరణ తగ్గిందని భావిస్తున్నారు. పీడీపీ అభ్యర్థి నుంచి గట్టి పోటీ లేకపోవడం అబ్దుల్లాకు అనుకూలాంశమే. అయితే, గతంలో తీవ్రవాదిగా ఉండి ప్రజాతంత్ర పంథా ఎంచుకున్న పీపుల్స్ కాన్ఫరెన్స్ (పీసీ) నేత సజ్జద్ గనీ లోన్ రాష్ట్రంలోని రెండు ప్రాంతీయ పక్షాలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. కిందటేడాది చివర్లో జరిగిన శ్రీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ బహిష్కరించడంతో పీసీ అభ్యర్థి నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పార్టీ తరఫున ఇర్ఫాన్ అన్సారీ ఇక్కడ పోటీలో ఉన్నారు. రాజకీయాలకు అన్సారీ కొత్తే అయినా ఫారూఖ్‌కు గట్టి పోటీ ఇస్తున్నారనీ, నేషనల్ కాన్ఫరెన్స్‌కు పడే ఓట్లను ఆయన గణనీయంగా చీల్చుకుంటారని పరిశీలకులు భావిస్తున్నారు. పీసీ అభ్యర్థి రంగంలోకి దిగడం వల్ల అబ్దుల్లా గెలుపు అంత సులభం కాదని అంటున్నారు. తీవ్రవాద కార్యకలాపాలు శ్రీనగర్ పరిధిలో తక్కువే ఉత్తర, దక్షిణ కశ్మీర్‌తో పోల్చితే ఈ నియోజకవర్గ పరిధిలో వేర్పాటువాద తీవ్రవాద కార్యకలాపాలు చాలా తక్కువ. కాని, పోలింగ్ బహిష్కరణకు ఇచ్చిన పిలుపు 2017 ఉప ఎన్నికలో పనిచేసింది. ఈసారి కూడా ఎంత శాతం జనం ఓటు హక్కు వినియోగించకుంటారో చెప్పడం కష్టం. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫారూఖ్ ఈసారి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారు. శ్రీనగర్‌లో కాంగ్రెస్ పోటీ పెట్టలేదు. జమ్మూ, ఉధంపూర్‌లో కాంగ్రెస్‌కు నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతు ఇస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో 81 ఏళ్ల ఫారూఖ్ గెలుపు అవకాశాలు మెరుగయ్యాయని ఆయన పార్టీ నమ్ముతోంది. బీజేపీతో చేతులు కలిపి రాష్ట్రంలో సంకీర్ణ సర్కారు నడపడంతో పీడీపీ జనాదరణ కోల్పోయింది. కాంగ్రెస్ వ్యతిరేక వాతావరణం కూడా పెద్దగా లేదు. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత గెలుపుపై అనుమానాలు అనవసరమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
జమ్మూలో జట్టు కట్టిన కాంగ్రెస్, ఎన్సీ
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య పొత్తు చిగురించింది. మొత్తం 6 లోక్‌సభ స్థానాలు ఉన్న జమ్మూ కశ్మీర్లో సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య బుధవారం చర్చలు జరిగాయి. కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్, ఎన్సీ నుంచి ఫరూక్ అబ్దుల్లా భేటీలో పాల్గొన్నారు. చర్చల అనంతరం పొత్తు కుదిరినట్లు ఫరూక్ ప్రకటించారు. రెండు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయగా, ఒక స్థానంలో ఎన్సీ అభ్యర్థిని నిలపనుంది. జమ్మూ, ఉద్ధాంపూర్ స్థానాల్లో కాంగ్రెస్, శ్రీనగర్‌లో ఎన్సీ పోటీ చెయ్యనున్నాయి. అనంతనాగ్, బారాముల్లాలో స్నేహపూర్వక పోటీ ఉంటుందని ప్రకటించారు. శ్రీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ ఫరూక్ అబ్దుల్లా పోటీ చెయ్యనున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఇక లడక్ లోక్‌సభ స్థానంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఎవరిని పోటీని నిలపాలనే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఇరుపార్టీల ప్రతినిధులు ప్రకటించారు. లౌకిక పార్టీలతో పొత్తు ద్వారా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పోటీలోకి దిగుతున్నట్లు ఫరూక్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో బలమైన కూటమి వల్ల సరిహద్దుల్లో పాకిస్తాన్ ఆగడాలను అడ్డుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. గెలుపు కోసం ఇరుపార్టీల నాయకులంతా ప్రచారంలో పాల్గొంటారని ఎన్సీ అధినేత తెలిపారు. -
ఓరుగల్లులోఉద్యోగినుల జాతీయ సదస్సు
జనవరి 24, 25 తేదీల్లో నిర్వహణ: టీఎన్జీవోల నేత దేవీప్రసాద్ హన్మకొండ చౌరస్తా: ఉద్యమాల పురిటిగడ్డ ఓరుగల్లు వేదికగా వచ్చే ఏడాది జనవరిలో అఖిల భారత మహిళా ఉద్యోగుల సదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎన్జీవో యూనియన్ గౌరవ అధ్యక్షుడు దేవీప్రసాద్ తెలిపారు. హన్మకొండలోని టీఎన్జీవోస్ భవన్లో ఆదివారం జరిగిన సదస్సు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి 24, 25వ తేదీల్లో రెండు రోజుల పాటు వరంగల్ నిట్‌లో జాతీయ సదస్సు జరుగుతుందని, సీఎం కేసీఆర్ సదస్సును ప్రారంభిస్తారని తెలిపారు. సదస్సు ద్వారా ఆరు దశాబ్దాలపాటు కొనసాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో మహిళా ఉద్యోగుల పాత్ర, రాణి రుద్రమదేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ పోరాటస్ఫూర్తిని చాటుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నూతన ఫించన్ విదానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి, తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు, టీఎన్జీవోస్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రేచల్, కన్వీనర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.