శ్రీనగర్: 2024 లోక్‌సభ ఎన్నికలు జమ్మూ కశ్మీర్‌కు చాలా ముఖ్యమైనవని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఈ ఎన్నికల ద్వారా కేంద్రానికి కశ్మీర్ ప్రజలు ఒక ప్రశ్నకు గట్టి సమాధానం ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల ద్వారా 5 ఆగస్టు, 2019 రోజున కేంద్రంలోని బీజేపీ తీసుకున్న నిర్ణయం సరైందా?.. కాదా? అనేది తెలియజేయాలన్నారు. బుధవారం నిర్వహించిన పార్టీ సమావేశంలో ఒమర్ అబ్దుల్లా పాల్గొని మాట్లాడారు.
‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్ స్వయంప్రతిపత్తి మీది తీసుకున్న నిర్ణయం సరైందే అనిపిస్తే.. నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయకండి. మీ జీవితాలు గతం కంటే మేరుగ్గా మారినట్లు భావిస్తే మాకు ఓటు వేయకండి. కేంద్రం తీసుకున్న నిర్ణయం మనకు ఏమాత్రం ఆమెదయోగ్యం కాదని మీ ఓటు ద్వారా కేంద్రంలోని బీజేపీకి సందేశం పంపండి.
5, ఆగస్టు 2019న కేంద్రం తీసుకున్న నిర్ణయం అన్యాయమని భావిస్తే నేషనల్ కాన్ఫరెన్స్‌కు ఓటు వేయండి. నిరసన చేపట్టడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఓటు ద్వారా కేంద్రానికి స్పష్టమైన సందేశం పంపాలి. మనం శాంతిని దూరం చేసే రాళ్లు విసిరే యువత కాదు. మనం శాంతిని నెలకొల్పడం కోసం త్యాగాలు చేసిన వాళ్లం’ అని ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు.
లోకసభ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్ పోటీ చేయగా.. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి జమ్ములోని రెండు స్థానాలు దక్కాయి. అయితే పీడీపీ పార్టీ ఇండియా కూటమిలో భాగమైనప్పటికీ తాము ఒంటిరిగానే బరిలోకి దిగుతామని ప్రకటించటం గమనార్హం. అయితే పొత్తులో భాగంగా అనంత్ నాగ్ స్థానాన్ని తమకు కేటాయించాల్సిందిగా పీడీపీ డిమాండ్ చేసింది.
ఈ ప్రతిపాదనపై నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అయితే అక్కడి నుంచి పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పోటి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. జమ్ము కశ్మీర్‌లో ఏప్రిల్ 19నుంచి మే 20 వరకు ఐదు దఫాల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment