శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపుతోందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం ఓ ర్యాలీలో పాల్గొని మాట్లాడారు.
‘నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఉగ్రవాదుల పట్ల సానూభూతి ప్రదర్శిస్తోంది. ఇటీవల పార్టీకి చెందిన నేత ఒమర్ అబ్దుల్లా పార్లమెంట్ మీద దాడి చేసిన దోషి అఫ్జల్ గురుకు మరణశిక్ష విధించటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. నేను ఒమర్ అబ్దులా అడుగుతున్నా.. అఫ్జల్ గురుకు ఉరిశిక్ష బదులుగా పూలమాల వేయమంటారా?. ఆ పార్టీ జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌న పునరుద్ధరిస్తామని చెబుతోంది.
...కానీ, గత ఐదేళ్లలో రాష్ట్రంలో 40వేల ఉద్యోగాలు కల్పించాం. జమ్ము కశ్మీర్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ప్రజలు భారత్‌లో భాగం కోరుకునే స్థాయిలో మేము కశ్మీర్‌ను అభివృద్ధి చేస్తాం. పీవోకేలోని ప్రజలను పాకిస్తాన్ విదేశీలుగా చూస్తే.. భారత్ తమ సొంతవారిగా చూస్తుంది’ అని అన్నారు. ఇక.. జమ్ము కశ్మీర్‌లో సెప్టెంబర్18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, అక్టోబర్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. జమ్ము కశ్మీర్‌లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
చదవండి: అఫ్జల్ గురు ఉరిశిక్ష వల్ల ప్రయోజనం లేదు: ఒమర్ అబ్దుల్లా
Comments
Please login to add a commentAdd a comment