
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిటిష్ హయాం నాటి దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదనకు సంబంధించి కాంగ్రెస్ సహా విపక్షాలు అడిగిన ప్రశ్నలపై ప్రభుత్వం సమాధానం తెలిపింది. దేశద్రోహ నేరానికి సంబంధించి ఐపీసీలో పొందుపరిచిన నిబంధనను రద్దు చేసే ప్రతిపాదన ఏమీ లేదని బుధవారం రాజ్యసభలో హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై విద్వేషపూరితంగా వ్యవహరించే వారిపై ప్రయోగించే పురాతన దేశ ద్రోహ చట్టాన్ని తొలగించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలించడం లేదని మంత్రి పెద్దల సభలో పేర్కొన్నారు. కాగా, దేశద్రోహ చట్టాన్ని ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్ధులపై ప్రయోగిస్తోందని, ప్రభుత్వ విధానాలను తప్పుపట్టే వారిని వేధించేందుకు వాడుతుందని విపక్షాలు చాలాకాలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment