మాలీ: మాల్దీవులు రాజకీయాల్లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆ దేశ పార్లమెంట్ స్పీకర్‌గా మాజీ అధ్యక్షుడు మహ్మద్ నషీద్ ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న మాల్దీవులు డెమోక్రటిక్ పార్టీ నషీద్‌ను ఏకగ్రీవంగా ఎన్నికుంటున్నట్లు ప్రకటించింది. బుధవారం ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మాల్దీవులు అధ్యక్షుడిగా 2008-2012 కాలంలో నషీద్ పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. దేశ చరిత్రతో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన మొదటి అధ్యక్షుడు మహ్మాద్ నషీద్ కావడం విశేషం. తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్న నషీద్ 13 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విపక్షనేత ఇబ్రహీం మహ్మద్ నల్హీ అఖండ విజయం సాధించారు. దీంతో కొత్తగా స్వీకర్‌ను ఎన్నుకోవల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment