ఏపీ ప్రత్యేక హోదాను కోరుతూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్ ముందు ధర్నాకు దిగారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్కేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాటు కేంద్రంలో మోదీతో అంటకాగింది వ్యభిచారమా, కాపురమా? అని ప్రశ్నించారు. చంద్రబాబు నాలుగు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సీఎంకాగానే తిన్నదంతా కక్కిస్తామని హెచ్చరించారు.