
సాక్షి, హైదరాబాద్ : ముస్లిం రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని కాంగ్రెస్ పార్లీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్లు సాధ్యం కాదని కేంద్రం చెప్పిందని, దానికి టీఆర్‌ఎస్ ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ వేదికగా టీఆర్‌ఎస్ డ్రామాలాడుతోందని ఎద్దేవా చేశారు. మెడీ-అమిత్ షా కనుసన్నల్లోనే సీఎం కేసీఆర్ నాటకాలడుతున్నారని ఆయన అన్నారు.